Tenth & Intermediate: ‘ఓపెన్’ పరీక్షలు తేదీలు ఇవే..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్టోబర్ 16 నుంచి 26 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పదో తరగతి పరీక్షకు 324 మంది, ఇంటర్మీడియెట్ పరీక్షలకు 165 మంది హాజరు కానున్నట్లు వివరించారు. పదో తరగతి కోసం రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్ కోసం ఒక కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చదవండి: Open schools: ఓపెన్ స్కూల్ విద్య.. రెగ్యులర్ కోర్సులతో సమానం.. అడ్మిషన్లకు చివరి తేదీ
అభ్యర్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత లోనికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అధ్యయన కేంద్రాలతో పాటు వెబ్‌సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లను పొందవచ్చని సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 30 నుంచి నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు. విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్, సీఎస్, డీవోలు పాల్గొన్నారు.