Skip to main content

KU: పరీక్ష ఒకటి.. పేపర్‌ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?

ఆదిలాబాద్‌: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్‌డీఎల్‌సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఆగ‌స్టు 22న‌ జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది.
Kakatiya University distance education exams
పరీక్ష ఒకటి.. పేపర్‌ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?

 విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు.

చదవండి: Open School: ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినా సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా పరిగణిస్తారు: విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌
పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆగ‌స్టు 23న‌ ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది.

తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్‌ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్‌ కంట్రోలర్‌ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

చదవండి: Kakatiya University: దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 9 మంది డీబార్‌

Published date : 24 Aug 2023 03:46PM

Photo Stories