Jagananna Videshi Vidya Deevena: పేదలకు విదేశీ విద్యాదీవెన వరం
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నగదు జమ జిల్లాస్థాయి కార్యక్రమం గురువారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు పేద కుటుంబాల్లో పుట్టిన వారు స్థానికంగా ఉండే కొద్దిపాటి అవకాశాలను ఉపయోగించుకుని చదువుకునేవాళ్లని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం కోసం చేస్తున్న కృషితో సామాన్యులూ విదేశీ విద్యా ఫలాలను అందుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
Also read: Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన
మాతృదేశానికి సేవ చేయండి: జేసీ రాజకుమారి
జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో చదువుకునే వారు తిరిగి మాతృదేశానికి సేవ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్య కోసం వెచ్చిస్తోందన్నారు. ఇప్పుడు చదువుకోవాలనే ఆలోచన ఉండాలేగానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 47 మందికి రూ.5.13 కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు.
Also read: Jagananna Videshi Vidya Deevena: విద్యాదీవెన పథకానికి అర్హత.. ధన్యవాదాలు తెలిపిన సాయికిరణ్