Telangana BC Study Circle: జులై 20న OU లో "ఇన్ స్పైర్-2023" సివిల్ సర్వీసెస్ విజేతలతో ముఖాముఖి
"ఇన్ స్పైర్ 2023" పేరుతో ఈ నెల 20న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు ముఖ్య అతిథిగా, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండిబోయిన రవిందర్ యాదవ్ గౌరవ అతిధిగా హాజరు కానున్నారు. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకుంటారని టి.ఎస్. బి.సి. స్టడీ సర్కిల్, డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరితో పాటు ఉస్మానియా విద్యార్థులంతా వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టి.ఎస్. బి.సి. స్టడీ సర్కిల్ అండగా ఉంటుందని, వీరి కోసం ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలియ చేశారు.
Also read: UPSC Civils 22nd Ranker Pavan Datta సక్సెస్ సీక్రెట్ ఇదే.