UPSC Civils Ranker Success Story : ఓ వైపు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. సివిల్స్ కొట్టానిలా..
సివిల్స్–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మే 23వ తేదీన (మంగళవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో సివిల్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో అనంతపురం జిల్లా కదిరికి చెందిన యువకుడు బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 270వ ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి సక్సెస్ జర్నీ మీకోసం..
☛ UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..
కుటుంబ నేపథ్యం :
యూపీఎస్సీ సివిల్స్ జాతీయ స్థాయిలో 270 ర్యాంకుతో మెరిసిన బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి స్వగ్రామం ఓడి చెరువు మండలం బోయపల్లి. వీరి కుటుంబం ప్రస్తుతం కదిరిలో స్థిర పడింది. తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు. తండ్రి రాజశేఖరరెడ్డి విశ్రాంత జువాలజీ లెక్చరర్.
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే..
హైదరాబాద్‌లో ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఉమా మహేశ్వరరెడ్డి అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఢిల్లీలోని ‘వాజీరా’లో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. తమ కుమారుడికి సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు.