UPSC Ranker Success Story : వీరి కన్నీళ్లలను..కళ్లరా చూశా.. ఇందుకే సివిల్స్ వైపు వచ్చా.. కానీ
సరిగ్గా ఇదే ఆలోచనతో.. సివిల్స్ సాధించారు.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలకేంద్రానికి చెందిన దీప్తి చౌహాన్. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ దీప్తి చౌహాన్ సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలకేంద్రానికి చెందిన దీప్తి చౌహాన్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కిషన్‌లాల్. ఈయన వనపర్తి జిల్లా పెద్దమందడి ఏపీజీవీబీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి చంద్రకళ. ఈనె ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
ఎడ్యుకేషన్ :
దీప్తి తన చిన్నతనం నుంచి పదో తరగతి వరకు గద్వాలలోని విశ్వభారతి హైస్కూల్‌లో చదివారు. తర్వాత హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2012లో ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సాధించారు.
కనీసం చెప్పులు కూడా ఉండేవి కావు.. అలాగే..
ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజనులే ఎక్కువగా వచ్చేవారు. వారిలో చాలా మందికి కనీసం చెప్పులు కూడా ఉండేవి కావు. వారిని చూశాకే ఇలాంటి వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. డాక్టర్‌గా కన్నా కలెక్టర్ అయితే విస్త్రృతంగా సేవలు అందించవచ్చని అనుకున్నాను.
15 మార్కుల తేడాతో..
ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్‌లో ఉండగానే నా ఆలోచనను తల్లిదండ్రులతో పంచుకున్నాను. వారు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. 2020లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే 15 మార్కుల తేడాతో ర్యాంకును కోల్పోవాల్సి వచ్చింది. నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాను.
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
నా ఇంటర్వ్యూలో..
ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలను అడిగారు. ప్రత్యేకించి మిషన్ భగీరథ పథకం ప్రాముఖ్యత గురించి, పనితీరు గురించి వివరించమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలతో పాటు హైదరాబాద్‌లో ఏర్పాటైన ఐటీ హబ్ పనితీరు గురించి ప్రశ్నలను అడిగారు. లక్ష్యం ఏదైనా స్పష్టంగా ఉండాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమని సివిల్స్ ఆశావహులకు సూచించారు.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Tags
- deepti chauhan upsc civils ranker
- deepti chauhan upsc civils ranker success story
- deepti chauhan upsc civils ranker real story
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- Success Stories
- Inspire
- motivational story
- upsc civils ranker 630 rank deepthi
- sakshi education success story
- UPSC Civil Services
- Civil Services Examination 2023
- Inspiration
- motivational story