Smita Sabharwal, IAS : సక్సెస్ జర్నీ...ఈమె భర్త కూడా..
కరీంనగర్‌లో కలెక్టర్‌గా పనిచేసే సమయంలో అవినీతి అధికారులకు చుక్కలు చూపించారు.
మెదక్ జిల్లా కలెక్టర్‌గా వందలాది కంపెనీలకు సీఆర్ఎస్ కింద డబ్బులు చెల్లించేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డల తల్లులను సన్మానించారు. అంతేకాదు తాను కూడా ఓ తల్లినేనంటూ భోరున విలపించారు. మార్క్ ఫెడ్ ఎండీగా మార్కెటింగ్ శాఖను ప్రక్షాళన చేశారు. గోదాముల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆమె పనితీరును మెచ్చి సీఎంఓలో అదనపు కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇలాంటి అధికారి తమకు కావాలంటూ పలు జిల్లాల ప్రజలు కోరడం ఆమె పనితీరుకు నిదర్శనం.
వీరు భార్యాభర్తలని చాలా మందికి తెలియదు...
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లేడీ ఐఏఎస్ ఆఫీసర్స్‌లో స్మితా సబర్వాల్ ఒకరు. 2001 లో ట్రైనీ కలెక్టర్ గా విధుల్లో చేరారు. ఈమె ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను వివాహాం చేసుకున్నారు. వీరు భార్యభర్తలని చాలా మందికి తెలియదు.
ఎన్నికల సమయంలో...
మెదక్ జిల్లా కలెక్టర్ గా స్మితా సబర్వాల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నవ్యరీతిలో ముందుకెళ్లారు. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు బహుమతులు ప్రకటించారు.
పనిచేసిన జిల్లాలు...
ఈమె కడప, చిత్తూర్, కర్నూల్, విశాఖపట్నం, మెదక్,సంగారెడ్డి, కరీంనగర్ మొదలైన జిల్లాలలో పనిచేశారు.
మాట్లాడే బాషలు..
ఈమె తెలుగు, ఇంగ్లిష్, బెంగాల్ బాషలను ఆనర్గళంగా మాట్లాడగలరు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే..
కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 26 నెలల్లో పాలనపై తనదైన ముద్ర వేశారు. పౌర సరఫరాల శాఖ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఐఏఎస్ అధికారిని పట్టుబట్టి బదిలీ చేయించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 25 మంది వైద్య సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీ చేశారు. ఒకే పర్యాయం 40 మంది తహశీల్దార్లను బదిలీ చేసి రెవెన్యూ పాలన గాడిలో పెట్టారు.
ఈ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపారు..
ప్రభుత్వ పథకాల అమలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు రాష్ట్ర ఐటీ శాఖ నుంచి రెండు పథకాలు, రూ.15 లక్షల రివార్డు సాధించారు. 20 సూత్రాల పథకం అమలులో 2011-12కు గాను జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపారు. ‘అమ్మ లాలన’, ‘మార్పు’ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బాల్యంలో కర్ణాటక అండర్ 16 జట్టుకు బ్యాడ్మింటన్‌లో ప్రాతినిథ్యం వహించారు. ఈమె భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్.
విద్య:
ఈమె డిగ్రీని హైదరాబాద్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ పూర్తి చేశారు.
స్మితా సబర్వాల్ ప్రొఫైల్..
➤ జననం 19 జూన్, 1977
➤ మాతృభాష బెంగాలీ
➤ విద్య బీకాం (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ, సికింద్రాబాద్)
➤ ఐఏఎస్2001 బ్యాచ్, (తొలి ప్రయత్నంలోనే యుపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు)
☛ 2001లో ఆదిలాబాద్ ట్రెయినీ కలెక్టర్
☛ 2003-04లో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్
☛ 2004-06లో పీడీ, రూరల్ డెవలప్‌మెంట్
☛ 2006-07లో మున్సిపల్ కమిషనర్, వరంగల్
☛ 2007-2011లో జాయింట్ కలెక్టర్ కర్నూలు, హైదరాబాద్
☛ 2011-2013 జూన్ వరకు కరీంనగర్ కలెక్టర్‌గా విధుల నిర్వహణ ముక్కుసూటి అధికారి
Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...