Skip to main content

Success Story: అమ్మ కోరిక ఐఏఎస్.. కోచింగ్ లేకుండానే 24 ఏళ్ల‌కే కొట్టానిలా..

లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చంటున్నారు సివిల్స్ 101వ ర్యాంకర్ వాసన విద్యాసాగర్‌నాయుడు.
Vidhya Sagar Naidu
Vidhya Sagar Naidu

తన మాతృభూమి నరసాపురం. ఐఏఎస్ కావాలన్న అమ్మ కోరికను 24 ఏళ్ల వయసులో నెరవేర్చానన్నారు. తన విద్యాభ్యాసం, సివిల్స్ ప్రిపరేషన్ విశేషాలను సాక్షికి ప్ర‌త్యేకంగా పంచుకున్నారు ఇలా..

Anudeep Durishetty, IAS: నేను సివిల్స్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించ‌డానికి కార‌ణం ఇదే..

ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జవాబు: నాన్న త్యాగరాజు హైదరాబాద్‌లో రైల్వే సీనియర్ వర్క్‌స్టడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. నాన్న వాళ్లది భీమవరం, అమ్మ సొంతూరు నరసాపురం. దీంతో నాకు నరసాపురంతో అనుబంధం ఎక్కువ.

ప్రశ్న: మీకు ఐఏఎస్ అయ్యేందుకు ప్రేరణ ఎవ‌రు ?
జవాబు: మా అమ్మ, తాత గారు పోతుల నర్సింహరావు (అమ్మనాన్న). తాతగారు కష్టపడి పైకొచ్చారు. చిన్నస్థాయి వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కష్టపడి చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ప్రేరణ కలిగించేది. దీంతో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా చేసుకున్నా.

Surya Sai Praveen Chand,IAS : అమ్మ చెప్పిన ఈ మాట కోసమే ఐఏఎస్ సాధించా..

ప్రశ్న: మీ విద్యార్హతలు ఏమిటి ?
జవాబు: నరసాపురం క్రిస్టియన్ ఆసుపత్రి (మిసమ్మ ఆసుపత్రి)లో 1992 మార్చి 25న జన్మించాను. ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలోని డోర్నకల్‌లో చదివా. 8వ తరగతి నుంచి బీటెక్ వరకు హైదరాబాద్‌లో చదివా. 2013లో బీటెక్ పూర్తయింది.

ప్రశ్న: మీరు సివిల్స్‌కు ఎలా ప్రిపేర‌య్యారు..?
జవాబు: సొంతంగానే. ఉన్నత స్థాయిలో శిక్షణ ఏమీ తీసుకోలేదు. హైదరాబాద్‌లో మూడు నెలలు, ఢిల్లీలో ఓ నెలపాటు సాధారణ శిక్షణ తీసుకున్నా. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. సబ్జెక్ట్‌ల పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాను.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

ప్రశ్న: కోచింగ్‌ లేకుండానే ఐఏఎస్ సాధించవచ్చా.. ?
జవాబు: తప్పకుండా సాధించవచ్చు. ఇందుకు నాతో పాటు చాలా మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. మా బ్యాచ్‌లో రిక్షావాలా కుమారుడు ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే మనుమడూ ఎంపికయ్యారు. సివిల్స్ సాధించడం కష్టం, ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 2014లో తొలిసారి సివిల్స్ రాసా 2015లో రెండో ప్రయత్నంలో 101వ ర్యాంక్ వచ్చింది. నా ఆప్షన్ సబ్జెక్ట్ హిస్టరీ.

Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్‌

ప్రశ్న: మీరు సైన్స్ విద్యార్థి కదా.. మరి చరిత్ర ఎలా..?
జవాబు: అదే తప్పు. ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు చదవాలనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టుల్లో డిగ్రీ చదివించాలి. ఐఏఎస్‌కు కావాల్సింది ఏదైనా డిగ్రీ మాత్రమే. అది సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఏదైనా కావొచ్చు.

SP Anuradha : ఎంతో ఇష్టంగా సాధించుకున్న ఈ జాబ్‌..కానీ

ప్రశ్న: మీరు ఐఏఎస్ కాకుంటే.. త‌ర్వాత మీ ఆప్షన్‌..?
జవాబు: 2013లో బీటెక్ పూర్తయ్యింది. ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశా. ఒకవేళ ఐఏఎస్ కాకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఆప్షన్‌గా పెట్టుకున్నాను.

ప్రశ్న: యువతకు మీరిచ్చే స‌ల‌హాలు..?
జవాబు: 2035 నాటికి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది మన దేశానికి ఉన్న బలం. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. ఏదో సాధించాలనే తపన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. యువత పుస్తకాలు ఎక్కువ చదవాలి. నా చిన్నప్పుడు నాన్నగారు గిఫ్టులుగా బొమ్మలు కాకుండా పుస్తకాలు ఇచ్చేవారు. బహుశా ఇదే నన్ను ఐఏఎస్‌ను చేసిందేమో.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Published date : 11 May 2022 06:06PM

Photo Stories