UPSC Civil Ranker Success Story : తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ కొట్టానిలా.. ఎప్పటికైన నా లక్ష్యం ఇదే..
జేఈఈ మెయిన్స్‌లో కూడా..
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన ఆదా వెంకటేశ్–వాణి దంపతులు ప్రస్తుతం పట్టణంలోని రవీంద్రనగర్‌లో స్థిరపడ్డారు. వారి చిన్న కుమారుడైన సందీప్ ఐదో తరగతి వరకు పట్టణంలోని లిటిల్‌ప్లవర్ స్కూల్‌లో, ఆరు నుంచి పది వరకు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని నవోదయలో చదివాడు. ఇంటర్ హైదరాబాద్‌లోని గాయత్రీ కళాశాలలో పూర్తి చేశాడు. జేఈఈ మెయిన్స్‌లో 550వ ర్యాంకు సాధించాడు.
నా లక్ష్యం ఇదే..
బీహార్ రాష్ట్రంలోని ధన్‌బాద్ ఐఐటీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. తర్వాత బెంగుళూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశాడు. గతేడాది ఉద్యోగాన్ని వదిలేశాడు. హైదరాబాద్‌లో సివిల్స్‌కోసం ఆన్‌లైన్ శిక్షణ పొందుతున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించాడు. అయితే ఐఏఎస్ తన లక్ష్యమని, సాధించే వరకు అలుపెరుగకుండా శ్రమిస్తానని సందీప్ పేర్కొన్నాడు.
వీరి ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు కొట్టానిలా..
తల్లిదండ్రులు, కుటుంబీకుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించినట్లుగా తెలిపాడు. సందీప్ తండ్రి ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు రంజిత్‌కుమార్ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ మెరుగైన ర్యాంకు సాధించడంపై ఆయన తల్లిదండ్రులు, కుటుంబీకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags
- UPSC Civils Ranker Success Story
- UPSC Civil Ranker Aadha Sandeep Kumar
- UPSC Civil Ranker Aadha Sandeep Kumar Real Life Stroy in Telugu
- UPSC Civil Ranker Aadha Sandeep Kumar Inspire Story
- UPSC Civils Interviews
- UPSC Civils Success Story in Telugu
- UPSC Civils Ranker Inspire Story in Telugu
- UPSC Civil Ranker Aadha Sandeep Kumar Motivational Story in Telugu
- UPSCCivils2023
- SuccessFirstAttempt
- sakshieducation success stories