IAS Officer Inspire Success Story : ఓ ప్రముఖ సినీ నటుడు కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడిలా.. కానీ చివరికి..
తన టార్గెట్ వేరే పెట్టుకున్నాడు. ఏకంగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సీ సివిల్స్‌లో విజయం సాధించాడు. చివరికి సినిమా యాక్టర్ కొడుకు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఎవరతను అని ఇంకా చెప్పలేదు అనుకుంటున్నారా..? ఈయనే శృతన్‌జయ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన పూర్తి సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే.. కింది స్టోరీ చదవాల్సిందే..
కుటుంబ నేపథ్యం :
శృతన్‌జయ.. తండ్రి చిన్ని జయంత్. ఈయన తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తన నటనతో చెరగని ముద్ర వేశారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణ ఆయన కొడుకంటే సినిమా ఫీల్డ్ లోనే హీరోగానో లేక మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే స్థిరపడతాడని అందరూ అంచనా వేస్తారు.చిన్ని వారసుడిగా వచ్చిన శృతన్‌జయ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
చదువుల్లో టాపర్‌గా..
పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు ప్రదర్శించినప్పటికీ, ఆయన చేరాలనుకు గమ్యం వేరు. చదువుల్లో టాపర్ గా ఉండటంతో ఆయన తల్లిదండ్రులు చదువులవపైపు ప్రోత్సహించారు. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. సినిమా అంటే అదో రంగుల ప్రపంచం. ఆ రంగంలో ఉన్న వారు దానిలోనే కొనసాగడానికి ఇష్టపడతారు. తమ పిల్లలను కూడా అదే రంగంలో కొనసాగేందుకు ప్రోత్సహిస్తారు. కాస్తో కూస్తో స్టార్ డమ్ వచ్చిందంటే ఇక వారి తరతరాలు ఆ ఫీల్డ్ లో కొనసాగడానికి మొగ్గుచూపుతారు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, దేశాల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది.
☛ IAS Officer Success Story : ఇందుకే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశా..
దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో..
కానీ తమిళనాడుకు చెందిన చిన్ని జయంత్ ఆర్టిస్ట్ కొడుకు మాత్రం.. కాస్త భిన్నంగా ఆలోచించాడు. సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకోలేదు. తన టార్గెట్ వేరే పెట్టుకున్నాడు. ఏకంగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. సినిమా యాక్టర్ కొడుకు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు.
ఓ కంపెనీలో అధిక వేతనానికి ఉద్యోగం.. చేస్తునే.. సివిల్స్‌కు..
నారాయణన్ తన డిగ్రీని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుండి, మాస్టర్స్ డిగ్రీని అశోకా యూనివర్సిటీ నుంచి పొందారు. అనంతరం ఓ స్టార్టప్ కంపెనీలో అధిక వేతనానికి ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్స్ మాత్రమే ఉద్యోగం చేస్తూ ఉదయం సమయాల్లో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారు. రాత్రంతా పనిచేసినా.. ఉదయం వేళ కనీసం ఐదు గంటలు ఆయన యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో రోజుకు 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించి.., చివరికి 2015లో విజయం సాధించారు. ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో 75వ ర్యాంకు సాధించడం అంటే ఆయన కష్టం అందులో ఎంతుందో అర్థం అవుతుంది.
☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ తర్వాత ఉచితంగా
తన శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని పెట్టుకొని..
నారాయణన్.. ప్రస్తుతం తమిళనాడులోని త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన తండ్రి సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించినా.. ఆ గ్లామర్ ఫీల్డ్ నకు ఆసక్తిని కనబరచకుండా.. తన శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని పెట్టుకొని అనుకున్నది సాధించిన నారాయణన్ ప్రస్తుతం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
☛ IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే వరకు..
సినిమా రంగంలోకి వెళ్లకుండా సివిల్ సర్వీసెస్‌లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకోవడం ఆయన అసాధారణ సంకల్పానికి, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. స్టార్ కిడ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే వరకు అతని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, కృషి, అభిరుచి, సాధిస్తాననే నమ్మకం ఆయనను విజయతీరాలకు చేర్చింది.
☛ Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..
Tags
- Popular Tamil actor Chinni Jayanth’s son Srutanjay Narayanan is an IAS officer
- Srutanjay Narayanan IAS
- Srutanjay Narayanan IAS Family
- Srutanjay Narayanan IAS Education
- Srutanjay Narayanan IAS Details in Telugu
- Srutanjay Narayanan IAS Success Story
- Srutanjay Narayanan IAS Real Story
- Srutanjay Narayanan bagged the 75th rank in UPSC Civil Services Examination
- Srutanjay Narayanan IAS Success
- Srutanjay Narayanan IAS Inspire
- Competitive Exams Success Stories
- civils success stories
- Success Story
- Ias Officer Success Story
- Civil Services Success Stories
- actor Chinni Jayanth
- actor Chinni Jayanth story
- actor Chinni Jayanth family
- actor Chinni Jayanth real story
- sakshieducation success stories
- UPSCExams
- CareerChoice