IAS Success Story :ఈ కలెక్టర్ చూడ్డానికి కూల్.. కానీ పనిలో మాత్రం హార్డ్..
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్, సుజాత దంపతుల పెద్ద కుమారుడు. డాక్టర్ కుటుంబంలో పుట్టిన ఆయన పీజీ తర్వాత సివిల్స్ పూర్తి చేశారు. తండ్రి డాక్టర్ శ్రీనివాస్ కల నెరవేర్చేందుకు ఐఏఎస్ అయ్యారు.
IPS Success Story : ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఐపీఎస్ పాస్.. కానీ లక్ష్యం మాత్రం ఇదే..
2011లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్) దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా ఓ భారీ క్రతువు నిర్వహించారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యత అని అంటున్న కలెక్టర్ శ్రీనివాస్ ప్రద్యుమ్న సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామం. నా తండ్రి డాక్టర్ శ్రీనివాస్, తల్లి సుజాత గృహిణి. మేము ఇద్దరం. నేను ఇంటికి పెద్ద కుమారుడిని. తమ్ముడు అనూమ. నా తండ్రి మైసూర్, బెంగళూరులలో డీఎంఅండ్‌హెచ్‌ఓ, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 2007లో నేను వివాహం చేసుకున్నాను. భార్య శిల్ప, కూతురు అవ్యక్త, కుమారుడు విక్రమాదిత్య.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
ఐఏఎస్ వైపు ఎందుకు వచ్చానంటే..?
నాన్న నన్ను సివిల్స్ సాధించాలని చిన్నతనం నుంచి చెప్పేవారు. నేను 5వ తరగతి చదివేటప్పుడే ఐఏఎస్‌పై గురిపెట్టించారు. పీజీ అవ్వగానే సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మెయిన్స్‌కు ఢిల్లీలో కేవలం రెండు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నా. మొదటి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. అంతటితో నా ఆశయాన్ని వదులుకోకుండా మళ్లీ సివిల్స్ రాశాను. ఆ తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై నా కలను నెరవేర్చుకున్నాను. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య వల్లే సాధ్యపడుతుంది.
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
నా విజయాలు, లక్ష్యాలు ఇవే..
నేను చిత్తూరులో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడే పూర్తిగా అవగాహన ఉంది. జిల్లాలో ఎక్కువగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాను. ఎవ్వరూ చేయలేని విధంగా నేషనల్ హైవేలు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, ఓడీఎఫ్, ప్రకృతి వ్యవసాయం లాంటి కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయి.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
దేశంలోనే ప్రథమస్థానంలో..
మరుగుదొడ్ల నిర్మాణంలో నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ఓడీఎఫ్‌లో చిత్తూరును దేశంలో ప్రథమస్థానంలో నిలపడానికి జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు. ఆత్మగౌరవం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
నా సతీమణి సొంత డబ్బు వెచ్చించి..
సమాజ సేవంటే మక్కువ కావడంతో ఆమె అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకుంది. సొంత డబ్బు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది ఇటీవల నన్ను కలిశారు. అంగన్‌వాడీల అభివృద్ధి గురించి తెలుసుకున్నారు.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...