Skip to main content

Success Story : క‌టిక పేద‌రికం జ‌యించి.. క‌లెక్ట‌ర్‌ అయ్యానిలా.. నా చిన్న‌ప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం..

గంధం చంద్రుడు స్వస్థలం క‌ర్నూలు జిల్లాలోని కోటపాడు గ్రామం. వ్యవసాయ కుటుంబం. ఆ ఇంటిలో అతనొక్కడే గ్రాడ్యుయేట్. చదువులో అందరికంటే ముందు ఉండటంతో.. జవహర్ నవోదయ విద్యాలయాల పరీక్ష రాయాలంటూ ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.
Gandhapu Chandrudu IAS
గంధం చంద్రుడు, క‌లెక్ట‌ర్

దీంతో బనావాసిలోని జేఎన్‌వీలో ప్రవేశం పొందాడు.

మా ఊరిలోనే మొదట ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వ్యక్తిగా..
పదోతరగతి తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాడు. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉద్యోగ-అనుసంధాన వృత్తి విద్యా కోర్సును అందిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన అనంతరం 2000లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ (ఎస్‌సీఆర్‌జెడ్)లో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. దీంతో గ్రామంలోనే మొదట ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వ్యక్తిగా నిలిచాడు. ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్షతో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నోలో దూరవిద్య ద్వారా వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్, పబ్లిక్ పాలసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.

Smita Sabharwal, IAS : స‌క్సెస్ జ‌ర్నీ...ఈమె భ‌ర్త కూడా..

మొదటి ప్రయత్నంలోనే..

ticket collector


అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అనేక పర్యాయాయాలు రాత్రిపూట విధులకు హాజరై పగటిపూట చదువుకునేవాడు. ఇలా కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే 2009లో ఆల్ ఇండియా 198 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. దాదాపు దశాబ్దం పాటు కండక్టర్‌గా పనిచేసిన చంద్రుడు ఇప్పుడు 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి. 

Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

తానే స్వయంగా వెళ్లి..
మొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరంలో బాధ్యతలు చేపట్టారు. ఇది గిరిజన ప్రాంతం. ప్రతి ఇంటికి తానే స్వయంగా వెళ్లి ఓటుహక్కుపై అవగాహన కల్పించాడు. దీంతో సుమారు 20 వేల మంది మొదటిసారి 2014లో ఎన్నికల్లో ఓటువేశారు. అనంతరం 2015-18లో జాయింట్ కలెక్టర్‌గా విజయవాడకు బదిలీ అయ్యారు. ఆ సమయంలోనే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ బాధ్యతను ఆయన సమర్థంగా నిర్వహించారు. 12 రోజుల వ్యవధిలో 25 మిలియన్ల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అనంతపూర్ జిల్లా కలెక్టర్‌గా కూడా ప‌నిచేశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంస్థ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఏడాదిన్నర పాటు పని చేశారు. జిల్లాలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ..ప్ర‌జా క‌లెక్ట‌ర్ మంచి పేరు తెచ్చుకున్నారు. త‌ర్వాత‌ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. 

చూసేవారు ఆశ్చ‌ర్యంగా..

వ‌న్‌డే `కలెక్టర్` శ్రావణి


అనంతపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స‌మ‌యంలో..ఆ జిల్లాలో హఠాత్తుగా  ఆఫీసర్లు మారిపోయారు. ఏ ముఖ్యమైన సీట్‌లో చూసినా అమ్మాయిలే. వారే చురుగ్గా పర్యవేక్షణ చేస్తున్నారు.నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫైళ్ల మీద సంతకాలు చేస్తున్నారు. కలెక్టర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, ఆర్డీఓగా పదిహేను పదహారేళ్లలోపు అమ్మాయిలు పని చేయడం చూసేవారికి వారి ఆశ్చ‌ర్యంగా అనిపించింది. అక్టోబర్‌ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల వికాసాన్ని కాంక్షిస్తూ అప్పుడు జిల్లా కలెక్టర్‌గా ఉన్న‌ గంధం చంద్రుడు చేపట్టిన కార్యక్రమం ఇది.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

ఈ కార్య‌క్ర‌మంలో బాగంగా..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించండి రాత్రి 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులకు అధికారిక పనుల గురించి ఫోన్లు చేసి ఆటంకం కలిగించకండి... ఇవి అక్టోబ‌ర్ 11వ తేదీన‌ (ఆదివారం) అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన ఇంటర్మిడియెట్‌ విద్యార్థిని శ్రావణి ఇచ్చిన ఆదేశాలు. ఆ మేరకు ఆమె ఆ ఫైళ్ల మీద సంతకాలు చేసింది. అధికారులు ఆ నిర్ణయాల అమలును మొదలెట్టారు కూడా.

అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థి.. 
జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన తొమ్మిదవ తరగతి విద్యార్థి మధుశ్రీ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న లేఔట్‌ను తనిఖీ చేసింది. అంతే కాదు వర్షాలకు పాడైన ఆ లేఔట్‌ రోడ్లను వెంటనే రిపేరు చేయమని ఆదేశించింది. వీరిద్దరే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థినులు ఆర్డీఓలు, ఎమ్మార్వోలు, వివిధ శాఖల పీడీలుగా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు తాసీల్దార్లుగా పని చేశారు. అక్టోబరు 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు 'బాలికే భవిష్యత్తు' కార్యక్రమాన్ని చేపట్టి బాలికలకు ఒక అరుదైన గౌరవం దక్కేలా చేశారు.

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

ఆ అమ్మాయి జిల్లా కలెక్టర్‌గా..
అనంతపురం జిల్లా రాప్తాడు కేజీబీవీ (కస్తూర్బా గాంధీ విద్యాలయ) లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించింది. కలెక్టర్‌ చంద్రుడు ఆమెను తన సీట్‌లో కూచోబెట్టి పక్కన నిలబడి చప్పట్లతో ప్రోత్సహించారు. అంతేకాదు శ్రావణి తీసుకునే నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యత తీసుకున్న శ్రావణి నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న శారదా మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ను కాలినడకన తనిఖీ చేసి జగనన్న విద్యాకానుక పథకం అమలు తీరును పరిశీలించింది. ఆ స్కూలులో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించింది. ఇదంతా తనకు మధుర జ్ఞాపకంగా ఉందని శ్రావణి అంది. 

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..


కలెక్టర్‌ సీట్‌లో కూచున్నాక కలెక్టర్‌గా ప్రజలకు ఎంత మంచి చేయవచ్చో అర్థమైంది. ప్రజలకు వేగంగా సేవలందినప్పుడే వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుందని నేను అర్థం చేసుకున్నాను. బాలికలకు రక్షణ కల్పించాలని అన్నదాతలను ఆదుకోవాలని వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని నేను ఆదేశాలిచ్చాను. కలెక్టర్‌ బాధ్యత గొప్పదే అయినా నాకు మాత్రం పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తే ఎక్కువ ఇష్టం. అందుకే టీచర్‌ కావాలనేది నా కోరిక. ఒక్కరోజు కలెక్టరుగా అవకాశం కల్పించిన కలెక్టర్‌ సార్‌కు ధన్యవాదాలు...చెప్పింది శ్రావణి.

టీచర్స్‌ డే స్ఫూర్తితో...
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలను ఒక రోజు అధికారులుగా జిల్లావ్యాప్తంగా నియమించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ముందురోజే నిర్ణయించారు. ఎవరు ఏ అధికారిగా ఉండాలనే విషయాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. మొదట కేవలం కలెక్టరుగా మాత్రమే ఒక అమ్మాయిని ఒక రోజు నియమిద్దామని అనుకున్నాం. కానీ జిల్లా అంతటా వివిధ విద్యార్థినులకు ఈ బాధ్యత ఇస్తే వారికి స్ఫూర్తి కలుగుతుందని బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలని వారికి అనిపిస్తుందని తల్లిదండ్రులకు అమ్మాయిలను చదివించాలనే స్ఫూర్తి కలుగుతుందని అనిపించింది. నాకు ఈ విధంగా చేయాలని టీచర్స్‌ డే స్ఫూర్తిని ఇచ్చింది.

టీచర్స్‌ డే సందర్భంగా టీచర్లుగా చేసిన పిల్లలు ఎంతో సంతోషంగా ఫీలవుతారు. తాము కూడా ఒక హోదాలో ఉండాలనే భావన వారిలో కలుగుతుంది. అందుకే బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని భావించాం. వారు తీసుకునే నిర్ణయాలను కూడా అమలు చేయాలని స్పష్టంగా చెప్పాం అని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టరుగా, జేసీ–1,2,3గా, డీఆర్‌ఓగా, ఏఓగా వ్యవహరించిన మొత్తం 6 మంది విద్యార్థినులకు మెంటర్‌గా ఉంటానని... వారి ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీనిచ్చారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో..

IAS


అనంతపూర్ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడటం వంటి దురాచారాన్ని రూపుమాపేందుకు ‘ఆత్మ గౌరవం’ పోస్టర్‌ను విడుదల చేసి ప్రజల్లో అవగాహన చైతన్యయం కల్పించే దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఈ నినాదంతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ లాంటి పేర్లను మార్చాలని కేంద్రం జీఓ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను, దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు కలెక్టర్ గంధం చంద్రుడు.

 

Food

దేశంలో తొలిసారి అనంతపురం జిల్లా లో కుల కాలనీల పేర్లు మార్పు సామాజిక దురాచారంపై కలెక్టర్ గంధం చంద్రుడు పోరు ప్రారంభించారు. దాదాపు 480 కాలనీలకు పైగా పేర్లు మార్పుకు శ్రీకారం చుట్టారు. 2019లోనే జిల్లాలో జీవో జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో..మహారాష్ట్ర ప్రభుత్వం జీఓను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలనీ, జగ్జీవన్ రామ్ నగర్, విశ్వరత్న నగర్, విన్సెంట్ కాలనీ ఇలా పేర్లు పెట్టారు. అలాగే జిల్లా ప్రజలకు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సేవలందిస్తోన్న ఆర్డీటీ ఫౌండేషన్ స్థాపకుడు డేవిడ్ ఫెర్రర్ పేరును కాలనీలకు పెట్టి అక్కడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. మరికొన్ని ప్రాంతాల పేర్లు మార్చేందుకు చర్యలు చేపట్టారు.


క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కథ…

gandhapu chandrudu ias certificate story


అది 1992 వ సంవత్సరం. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామం….మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ….మధ్యాహ్న సమయం
ఓ పది మీటర్ల దూరంలో..MRO Office ఎదురుగా ఓ కంప చెట్టు. దాని కింద ఉన్న‌ చిన్న అరుగులాంటి బండమీద కూర్చుని ఉన్నాడు, ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి. ఆ కంపచెట్టు తెరిపెలు తెరిపెలుగా వుంది. ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది. అది తప్ప ఇంక అక్కడ నీడ ఉన్న‌ ప్రదేశం ఏదీ లేదు. దాని క్రిందనే తలదాచుకోవాలి, లేదంటే ఎండలో మాడాలి. వేరే మార్గం లేదు. ఆ అబ్బాయి ఆ చెట్టు కింద వున్న గజం రాయి మీద కూర్చొని MRO Office వైపు చూస్తూ ఉన్నాడు. ఏమైనా పిలుపు వస్తుందేమోనని. దాదాపు పదకొండున్నర – పన్నెండు ప్రాంతంలో వచ్చాడు అక్కడికి. అక్కడ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిని అడిగితే “ వేచి వుండు, MRO గారు వచ్చిన తర్వాత నీ పని చూస్తారు” అని చెప్పాడు.

ఆ MRO రాక కోసం…
ఆ కార్యాలయ అధికారి పిలుపు కోసం… చూస్తూ అక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నాడు ఆ అబ్బాయి. ఇంకో పెద్దాయన వచ్చి ఆ బండ మీద కూర్చుంటూ ఆ అబ్బాయిని అడిగాడు, “ఏం నాయనా! ఇక్కడ కూర్చున్నావు? ఏం పని కోసం వచ్చావు? Caste Certificate కోసం వచ్చాను పెద్దాయన”
“దాదాపుగా నెల రోజుల పైనే అయింది అప్లికేషన్ పెట్టి, ఈరోజు ఇస్తామన్నారు, అందుకే వచ్చాను అన్నారు.” “ఎవరు చెప్పారు?”. “మా ఊరి తలారి (Village Revenue Assistant) చెప్పాడు.”

“ఒక్కడివే కనపడుతున్నావ్? పెద్దలెవరూ రాలేదా , నీతో పాటు?”
“లేదు, పెద్దాయన. మా అమ్మానాన్న పనికి వెళ్లారు. నన్ను వెళ్లి Certificate తెచ్చుకోమన్నారు” “ఏం చదువుతున్నావ్?”
“ఐదవ తరగతి చదువుతున్నాను. అది అయిపోవచ్చింది. నవోదయ స్కూల్క్‌కి పరీక్ష వ్రాశాను. Select అయ్యాను. అన్ని Certificates తీసుకుని రమ్మని letter వచ్చింది.” Caste Certificate MRO Office లో ఇస్తారు కదా! దాని కోసం చాలా రోజులయ్యింది apply చేసుకొని. ఇప్పుడు ఇస్తారు వెళ్లి తీసుకోమని మావూరి తలారి చెప్పాడు, అందుకే వచ్చాను.

“నాన్న, నాకు Caste Certificate, ఇతర Certificates అన్నీ originals తీసుకొని రమ్మన్నారు, నవోదయ స్కూలుకు.” ఆరో తరగతి లో join అవ్వాలంటే అన్ని certificates తీసుకొని వెళ్లాలంట!”. “సరే మరి, నేనైతే రాలేను, నేను పనికి వెళ్ళాలి. ఇంతకు ముందు ఫోటో తీసుకోవడానికి వెళ్ళావ్ కదా! వారు వెళ్లినప్పుడు వెళ్లు మరి.” 

“వాళ్లు select కాలేదంట, వాళ్ళు ఇప్పుడు Certificate తీసుకోవడానికి రారు.” “సరే మొన్ననే కదా! నువ్వు వాళ్లతో కలిసి కొలిమిగుండ్ల వెళ్లి వచ్చావు, బస్సుల రూటు తెలుసుకదా! ఒక్కడివి వెళ్లిరాలేవా”? “నువ్వు రాలేకపోతే నేను వెళ్లి వస్తాను. నాకు చార్జీకి డబ్బులివ్వు మరి.”

“ఎంత?”

“పేరుసోముల నుంచి తిమ్మనాయుని పేటకు రూపాయిన్నర అక్కడి నుంచి కొలిమిగుండ్ల కు రెండు రూపాయిలు… మొత్తం మూడున్నర. మూడున్నర రాను, మూడున్నర పోను మొత్తం ఏడు రూపాయలు అవుతుంది.” “సరే, ఇదిగో! ఈ పది రూపాయలు తీసుకో!” మధ్యాహ్నం పూట అక్కడే కొలిమిగుండ్లలో ఏదో ఒకటి కొనుక్కుని తిను.” అంటూ తీసి పది రూపాయలు చేతిలో పెట్టారు.
“డబ్బులు జాగ్రత్త. అజాగ్రత్తగా వుండి డబ్బులు పోగొట్టుకున్నావంటే అంతే సంగతులు”. పది రూపాయలు తీసుకొని జాగ్రత్త‌గా, పొద్దున్నే వేసుకోవాల్సిన నిక్కర్ జేబులో పెట్టుకొని పడుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే లేచి, తయారయ్యి భోంచేసి ఎనిమిది కల్లా బయలు దేరాను. అంగీ (Shirt) నిక్కరు(half pant) వేసుకొని పది రూపాయల నోటును జాగ్రత్తగా పెట్టుకొని, పేరుసోముల దగ్గర వున్న బస్సు ఆగే స్ధలంలో వచ్చి నిలబడ్డాను.
పేరుసోముల నుంచి తిమ్మనాయుని పేట, అక్కడి నుంచి కొలిమిగుండ్ల వచ్చేసరికి జేబులో ఒక అయిదు రూపాయల నోటు, ఒకటిన్నరూపాయల చిల్లర మిగిలింది. కండక్టర్ ఇచ్చిన డబ్బులు అంగీ జేబులో పెట్టుకొని, బస్సు దిగి సరాసరి MRO Office కి వెళ్లి అక్కడ వున్న Junior Assistant ను కలిసి వచ్చిన పని చెప్పగానే MRO గారు బయటికి వెళ్లారు. వచ్చిన తరువాత కలువు అని చెప్పడంతొ, నేను ఫారం (ముళ్లకంప) చెట్టు కింద కూర్చుని wait చేస్తూ వున్నాను.
    అక్కడికి ఓ మాదిరిగా జనాలు వస్తూ పోతూ వున్నారు. MRO Office ఎదురుగా ఒకాయన తెల్ల బట్టలు వేసుకొనికుర్చీ మీద కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడుతూ వున్నాడు. కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు కుర్చీలో. వచ్చిన వారు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతూ వున్నారు
 “ఏం కావాలి నీకు?”
“Certificate కోసం వచ్చాను.”
“ఆ గదిలో clerk (Junior Assistant) వుంటాడు. ఆయన్నివెళ్లి అడుగు.”
ఆయన చూపించిన వైపున వున్న రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ వున్న వారిలో ఒకరితో అడిగాను – “సర్, నాకు Caste Certificate కావాలి apply చేసి చాల రోజులయింది. ఈ రోజు వస్తే ఇస్తామని చెప్పారు.
“ఏం పేరు?”
“గంధం చంద్రుడు”
“ఏ ఊరు”
“కోటపాడు”
“సరే, wait చెయ్యి MRO గారు సంతకం చేయ్యాల్సి వుంది. సార్ వచ్చి సంతకం చేసిన తరువాత ఇస్తాం..
“అలాగే సర్.”

MRO గారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వెళతారో తెలియదు. ఒక వేళ నేను తినడానికి బయటికి వెళ్తే, ఆయన వచ్చి వెళ్లిపోతే?
లేదు లేదు, నేనెక్కడికి వెళ్లకూడదు. Certificate తీసుకొని కావాలంటే అప్పుడు తింటాను ఏమైనా…

పన్నెండు…
ఒకటి…
రెండు…
మూడు…
నాలుగు గంటలు గడిచిపోయాయి.
ఆ ముల్లకంప చెట్టు కింద, అటూ ఇటూ తిరుగుతూ వచ్చిపోయేవారిని గమనిస్తూ…. వున్నాను. చెట్టు కింద వున్న బండ కాలుతూ వుంది, ఎండకు కాళ్లు కాలుతూ వున్నాయి, చెప్పులు లేక.

అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వున్నాను. దాదాపు మూడున్నర ప్రాంతంలో వచ్చారు MRO గారు. సరాసరి ఆయన room లోకి వెళ్లిపోయారు. అప్పటి వరకు అక్కడ దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని, కూర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి, MRO గారు రాగానే ఒక్క ఉదుటున లేచి, కుర్చీని పక్కకు జరిపి, వంగి ఆయన నమస్కారం పెట్టి, ఎక్కడలేని వినయం ప్రదర్శించాడు.

నాకు అది చూసి ఆశ్చర్యం అనిపించింది. మళ్లీ clerk వున్న రూమ్ లోకి వెళ్లి ఆయనకు గుర్తు చేశాను. MRO గారు వచ్చారు అని. సరే, నేను తీసుకొని వెళ్తాను files అన్ని, నువ్వు wait చెయ్యి అన్నట్లు చూపించాడు నాకు. మళ్లీ పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి మళ్లీ దగ్గరికి ‌వెళ్లాను. ఈ సారి బిళ్ల బంట్రోతు అడిగాడు.

“నీ పని కూడా అయిపోయిందిలే! ఏమన్నా తెచ్చావా?” నన్ను చూస్తూ అన్నాడు బిళ్ల బంట్రోతు. నాకు అర్ధం కాలేదు

“ఏమన్నా తెచ్చావా? అంటే చాలా చూస్తావేం?”
“డబ్బులున్నాయా?”

నా file ను పక్కన పెట్టి.. 
లేవని కానీ, వున్నాయనీ కానీ చెప్పకుండా అలా వుండిపోయాను నేను.
నేను ఏమీ చెప్పక పోయేసరికి, ఆయన నా file ను పక్కన పెట్టి మిగతా Certificate/Files మీద ఎక్కడయితే MRO గారు సంతకం చేశారో, దాని కింద అధికారిక stamp వేస్తూ, వచ్చిన వారికి వచ్చినట్టు certificates ఇస్తూవున్నాడు. వారు ఆయనకు ఏదో ఇస్తున్నారు. చేతిలో చెయ్యి కలుపుతూ
ఒక్కొక్కరి నుంచి ఒక్కో పద్ధతి…

ఒకరికేమో గోడ చాటుకు వెళ్ళి ఏదో చేతిలో చెయ్యి పెట్టి తీసుకొని, వెంటనే certificate తెచ్చి ఇస్తున్నాడు. ఇంకొకరితో అలా పది అడుగుల దూరం నడిచి, మళ్లీ లోపలికి వెళ్లి వాళ్ల certificate/Documents వాళ్లకి ఇస్తున్నాడు.
మద్యమద్యలో నా వైపు చూస్తూ వున్నాడు. ఇదంతా నాకు అర్ధం కావడం లేదు. అందరికీ Certificate/documents ఇస్తూవున్నాడు. నాకు మాత్రం ఇవ్వట్లేదు.
ఒకవైపు ఎండ…
ఒకవైపు ఆకలి…
బంట్రోతేమో certficate ఇవ్వడం లేదు.
వుండబట్టలేక మళ్లీ అడిగాను, “ నా certificate ఇవ్వండి.”
“సరే, ఇటు రా”
దగ్గరికి వెళ్లాను.

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

నా చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. అందులో అయిదు రూపాయిల నోటు చిల్లర ఆయన చేతికి చిక్కాయి. నేను వెనక్కి జరగబోయాను, చేతిని అడ్డు పెట్టబోయాను. కానీ రెండూ జరగలేదు. అంత వేగంగా జేబులో చెయ్యి పెట్టడం, డబ్బులు తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. లోపలికి వెళ్లి certificate బయటికి తెచ్చి, అక్కడ వున్న stool మీద దాన్ని వుంచి నా ఎదురుగానే దాని మీద MRO గారి designation stamp, office stamp (Round stamp) వేసి… “ఇదిగో నీ certificate తీసుకో.”

నాకు certificate ఇచ్చినందుకు సంతోషం కంటే, జేబులో నుంచి ఉన్న డబ్బు మొత్తం లాక్కునందుకు ఎక్కువ బాధ కలిగింది. కొద్ది సేపు ఆగాను, ఆయన ఏమన్నా కనికరించి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమోనని. ఆయనకు అటువుంటి ధ్యాసే లేదు. ఆయన మిగతా certificates కు stamp వెయ్యడం, వాటికోసం వారితో పక్కకు వెళ్లడం, వారితో చెయ్యి కలపడంలో busy గా ఉన్నాడు. అప్పటికి దాదాపు అయిదున్నర కావస్తుంది టైం.
ఏం చెయ్యాలో కొద్ది సేపు పాలుపోలేదు నాకు. కొద్ది సేపటికి మా అత్తగారి ఊరు బెలుం గుర్తుకువచ్చింది. అది కొలిమిగుండ్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కాళ్లకి పని చెప్పాను..
చిన్న సుబ్బమ్మ మా మేనత్త, బెలుం లో ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తను కూడా చిన్న అల్లుడినైన నన్ను చాలా మురిపెంగా చూసుకుంటుంది. బెలుంకు బస్సులో వెళ్లాలన్నా రూపాయిన్నర కావాలి. అది కూడా లేకుండా తీసుకున్నాడు ఆ బిళ్ల బంట్రోతు. ఇంక ఎక్కువసేపు ఆలోచించలేదు. వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఒక గంట.. గంటన్నరలో బెలుం చేరుకోవచ్చు.

అనుకున్నదే తడవుగా, కాళ్లకి పని చెప్పాను. కడుపు ఆకలితో నక నక లాడుతూవుంది. ఎండకు దుమ్ము, ధూళి కొట్టుకు పోయి ఉన్నాను. Certificate ను జాగ్రత్తగా ఒక పేపర్ లో చుట్టి రౌండుగా చేసి జేబులో పెట్టుకున్నాను.

కొలిమిగుండ్ల నుచి బెలుంకు సింగల్ రోడ్డు. ఎప్పుడూ పాడయిపోయి గతుకులు గతుకులుగా ఉంటుంది. ఆ దారిలో నాపరాళ్ల గనులు చాలా వున్నాయి. అందులో పని చేసేవారు మూడు నాలుగు లోపు పనులు ముగించి ఇళ్లకు వెళ్తారు. ఐదు వరకు ఎవ్వరూ ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.

రోడ్డు మీద ఒక్కడినే నడవడం మొదలు పెట్టాను, భయపడుకుంటూనే. చిన్న అడుగులు ఎంతగా వెయ్యాలనుకున్న ఎక్కువ దూరం పడవు. వేగంగా వెళ్లడం ఒక్కటే మార్గం. ఇక లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను . ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడం, ఆయాసం తగ్గేంత వరకు నడివడం తర్వాత మళ్లీ పరిగెత్తడం – మళ్లీ నడవడం..

ఇలా సాగింది నా ప్రయాణం. కొద్ది కొద్దిగా సూర్యకాంతి తగ్గుతూ ఉంది. ఆ పెద్ద కొండల వలన సూర్యుడు పూర్తిగా కనిపించకుండా అయిపోయాడు. దాదాపు చీకటిపడిపోయింది.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

భయం భయంగా..
భయం భయంగా, వేగంగా వెళ్లాలన్న ఆతృతతో రొప్పూతూ certificate ను, గుండెను అరచేతిలో పెట్టుకుని వెళ్లాను. దాదాపు పూర్తిగా చీకటిపడుతున్న సమయానికి ఆరున్నర ప్రాంతంలో బెలుంలో ఉన్న మా అత్తగారింటికి చేరిపోయాను. బయట వారు మంచం మీద మా మామ కూర్చుని వున్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నన్ను గమనించలేదు. నాకు ఆగి ఆయన్ని పలకరించే పరిస్ధితి లేదు. సరాసరి ఇంటి లోపలికి ‌వెళ్లాను.
ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు గమనించింది మా అత్త.

“ఏం నాయనా! బాగున్నావా?”
“ఈ టైములో వచ్చారేమి?” పెద్ద వాళ్లతో కలిసి వచ్చాననుకుని ఇంకా బయటకి చూస్తూ వుంది. మిగతా వారు ఎక్కడా అన్నట్టు. ఎవరూ వెనక లేకపోయెసరికి అప్పుడు అడిగింది.
“ఒక్కడివే వచ్చావా?”
“అవును, ఒక్కడినే వచ్చాను”

కాళ్లంతా దుమ్ము పట్టిపోయి వున్నాయి. మాటలు రావడం లేదు. నోరు ఎండిపోయి ఉంది. నీళ్లు ఇవ్వమన్నట్టు సైగ చేసాను. సూరి. మా అత్త కొడుకు నాకంటే నెల రోజులు చిన్నవాడు. వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చాడు. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాను, కాళ్లు నొప్పి పెడుతుంటే.

“తిన్నావా?”
“లేదు”
“ఎలా వచ్చావు?”
“కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ…”

అప్పుడు అర్ధం అయ్యింది మా అత్తకు ఏదో పొరపాటు జరిగింది అని. వచ్చి పక్కన కూర్చింది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగింది. ఏం జరిగిందని. మొత్తం జరిగిందంతా చెప్పాను. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.
గట్టిగా హత్తుకుని మంచం మీద నుంచి లేచి వంట గదిలోకి వెళ్లి పళ్లెం లో అన్నం, పప్పు పెట్టుకుని వచ్చి తినమని ఇచ్చింది. నా పక్కనే పడుకుని రాత్రి కాళ్లు పిసుకుతూ పడుకుంది. వాళ్లను శాపనార్ధాలు పెడుతూ.
పొద్దునే లేచి అత్త తో డబ్బులిప్పించుకుని కోటపాడుకు బయలుదేరాను.

వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం తెలిసింది.
“చిన్నోడు వచ్చాడా?” పనిముగించుకుని తిరిగి వచ్చి, కాళ్లు కడుక్కుంటూ అడిగాడు నాన్న, అమ్మని. అప్పటికి దాదాపు ఏడు గంటలు అవుతుంది. ఇంకా రాలేదా? సరే నేను bus stop దగ్గరికి వెళ్లి తీసుకుని వస్తాను అని, అమ్మ భోజనం తిని వెళ్లు అని అంటూ వున్నా వినకుండా గబగబా వెళ్లిపోయాడు.

పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి బాగా అలసి పోయి ఉన్నాడు. కాళ్లు, చేతులు కడుక్కుని, భుజం మీద towel వేసుకుని bus stop కి వెళ్లాడు.

పేరుసోములలో తిమ్మనాయుని పేట నుంచి కోవెలకుంట్ల వళ్లే బస్సులో రావాలి అబ్బాయి. చివరి బస్సు దాదాపు రాత్రి ఏడున్నర – ఎనిమిది మద్య వస్తుంది. దారిలో వేరేవాళ్లు ఎదురైతే వాళ్లను అడిగాడు. మా చిన్నబ్బాయిని ఏమన్నా చూసారా అని.

చివరి బస్సు ఎనిమిది గంటలకు వచ్చింది. అందులో కోటపాడు వాళ్లు ఒకరిద్దరు దిగారు. నేను కనపడలేదు. దిగిన వారిని ఆత్రంగా అడిగాడు. మా చిన్నబ్బాయిని ఎక్కడైనా చూసారా? అని. అందరి నుంచి లేదు/చూడలేదు అన్న సమాధానమే వచ్చింది.

Bus stop లో దాదాపు ఒక గంట సేపు .. అంటే తొమ్మిది వరకు వేచిచూసి, ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆయనకు, నాన్నకు భయం పట్టుకుంది. ఏమన్నా అయ్యిందా అబ్బాయికి. లేదా పని జరగక అక్కడే ఆగిపోయాడా? ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చెయ్యాలో పాలుపోక బాధపడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ కాలంలో ఫోన్లు లేవు. క‌నీసం మా గ్రామంలో ఎవరికీ ల్యాండ్‌ఫోన్‌ కూడా లేదు.

ఏమైపోయాడు, ఎలావున్నాడు తెలుసుకునే మార్గమే లేదు. పోనీ కొలిమిగుండ్ల కి వెళ్దామంటే బస్సులు లేవు ఆ టైములో… ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని వెళ్లడానికి కూడా దొరకవు. దొరికినా వాటిని అద్దెకు తీసుకునేంత స్థోమత లేదు.
ఇంటికి వచ్చీ రాగానే అమ్మ భయంగానే అడిగింది. ఎక్కడ పిల్లోడు అని. రాలేదు అని చెప్పగానే ఒకటే ఏడుపు.

నాన్న లోలోపల ఏడుస్తున్నాడు. అమ్మ బయటకి ఏడుస్తూ ఉంది గట్టిగా. వండిన భోజనం అలానే ఉంది. నాన్న బస్టాండుకు వెళ్లాడు కదా.. పిల్లోడిని తీసుకు వస్తాడు కదా.. అప్పుడు అందరం కలిసి తిందాం అని అమ్మ కూడా తినలేదు. నాన్న ఒక్కడే తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ తినాలనిపంచలేదు.
రాత్రంతా ఒకటే ఏడుపులు…. మధ్యమధ్యలో నాన్న ధైర్యం చెప్తున్నాడు అమ్మకు  “ఆ! ఏమి అయ్యింటాది. పని అయ్యిండదు. అక్కడే ఉంటాడు. పొద్దున్నేవచ్చేస్తాడులే.”

అన్ని దేవతలను వేడుకుంది అమ్మ మనసులో.. వాళ్లతో వీళ్లతో మాట్లాడాడు నాన్న. ఏం చేద్దాం ఇప్పుడు అని. ఉదయం ఒకటి రెండు బస్సులు వచ్చేవరకు వేచి చూడడం తప్ప మార్గము లేదని చెప్పారు వాళ్ళు.
గుండెను అరచేతిలో పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ, మేలుకుని ఉన్నారు. అమ్మ, నాన్న  ఇద్దరూ మరుసటి రోజు మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత కానీ భోజనం చెయ్యలేదు. ఇలా ముగిసింది నా  caste certificate కథ.

 

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

Published date : 24 Jan 2022 06:54PM

Photo Stories