Dr.Gajarao Bhupal IPS: డాక్టర్ వృత్తి నుంచి.. ఐపీఎస్ వైపు వచ్చానిలా..
సివిల్స్‌కు ప్రిపేర్‌పై ఆయన ఏమంటున్నారంటే.. నేను వారం రోజుల ప్రణాళికను ముందే తయారు చేసుకుని చదివాను.ఇతరులకు ఏదో సబ్జెక్టులో ఎక్కువ మార్కులువచ్చాయని ఆ సబ్జెక్టును చదవకుండా.. మనము దేనినైతే ఎక్కువగా ఇష్టాపడుతామో అదే సబ్జెక్టు చదవాలి. ముఖ్యంగా ఐపీఎస్‌కు ఎంపిక అవుతాననే నమ్మకం అందరిలోనూ ఉండాలి. చదివే సమయంలో అలసటగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మంచి వాతావరణంలో గడుపుతూ స్నేహితులతో ఉండేలా ప్రయత్నించాలి.
Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. ఐపీఎస్ అయ్యానిలా..
కుటుంబ నేపథ్యం :
మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అమ్మానాన్నలు అనురాధ, సీతారామస్వామి ఇద్దరూ వైద్యులే.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
నా ఎడ్యుకేషన్ :
డిగ్రీ వరకు కాకినాడలోనే చదువుకున్నాను. మెడికల్ విద్య అభ్యసించాను. 2006లో ఐపీఎస్ కోసం ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ సమయంలో ఒకసారి ఐపీఎస్ రాసినా ఎంపిక కాలేదు. శిక్షణ ముగిసిన అనంతరం 2007లో కాకినాడలోని శంకవరం పీహెచ్‌సీలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశాను.నేను ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చదువుకున్నాను.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
మళ్లీ ఐపీఎస్‌కు..
అక్కడ విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ ఐపీఎస్‌కు సిద్ధమయ్యాను. 2008లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. వైద్యుడిగా కాకుండా ఏ వృత్తిలోనైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించాను. శిక్షణ అనంతరం 2010-13 వరకు భద్రచలం ఏఎస్పీగా, 2013-అక్టోబర్ వరకు మెదక్ అడిషనల్ ఎస్పీగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చాను. మొదటి నుంచీ నేను ఐపీఎస్ కావాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సంతోష పడ్డాను. వైద్యునిగా రోగులకు, ఎస్పీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.