Skip to main content

Success Story: ఈ ల‌క్ష్యం కోస‌మే.. లక్షల జీతం వ‌దులుకున్నా.. కానీ..

సివిల్స్ అంటే మాటలు కాదు.. అదో యజ్ఞం. తెలివితేటలతోపాటు దృఢ సంకల్పం ఉండాలి. నిరంతర అధ్యయనం తోడవ్వాలి. సమాజానికి సేవ చేయాలన్న దీక్ష ఉండాలి.
కిల్లి చంద్రశేఖర్, ఐఏఎస్‌
కిల్లి చంద్రశేఖర్, ఐఏఎస్‌

కఠోర పరిశ్రమతో లక్ష్యాన్ని ఛేదించాలి. విశాఖ యువకుడు కిల్లి చంద్రశేఖర్ 234 ర్యాంకును సాధించి యువతకు మార్గదర్శిగా నిలిచాడు. లక్షల జీతం ఇచ్చే అమెరికా ఆఫర్‌ను వదులుకుని ప్రజాసేవ కోసం సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకొని సఫలమయ్యాడు. ఆయన ఏం చెబుతున్నారో చూద్దాం.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

ఎంబీఏ పూర్తయ్యాక..
మా స్వస్థలం చోడవరం. మాది గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యవసాయ కుటుంబం. నాన్నగారు కిల్లి శంకర్రావు ఎంఈఎస్‌లో అసిస్టెంటు గారిజన్ ఇంజనీరు పనిచేయడంతో వైజాగ్‌లోనే ఇంటర్ వరకు నా చదువు సంధ్యలన్నీ సాగాయి. కోల్‌కతా ఐఐటీలో బీటెక్ చేసి, ముంబాయి నిట్‌లో ఎంబీఏ చేశాను. ఎంబీఏ పూర్తయ్యాక కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో బిజినెస్ కన్సల్టెంటుగా ఉద్యోగం వచ్చింది.

రూ.30 లక్షలు వ‌చ్చే ఉద్యోగానికి రాజీనామా చేశా..
ఇంగ్లండ్‌లో కొన్నాళ్లు చేస్తుండగా అమెరికా నుంచి ఆఫర్.. రూ.30 లక్షల జీతం. అప్పుడే నాలో ఆలోచన మొదలయ్యింది. ప్రయివేటు కంపెనీల్లో చేస్తే మన సేవలు ఒక పరిమితికి మించవని తెలుసుకున్నాను. ఆర్థికంగా మనకు ఉపయోగపడి నా ప్రజా సేవలు విస్తృతం కావు. అందుకే ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా అమెరికా వెళ్తే డబ్బు సంపాదిస్తాం కాని మన దేశానికి సేవ చేయలేం కదా. అందుకే ఇక్కడే ఉండిపోవాలని నిర్ణ‌యించు కున్నాను. జాబ్‌కు రాజీనామా చేశా.

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

వీరి ప్రోత్సాహాన్ని మరువలేను..
ఈ విషయం మా నాన్నకు, మా కుటుంబ సభ్యులు చెప్పగానే మరోసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమన్నారు. కాని మా పెద్దన్నయ్య ప్రకాష్ నా నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారు. రెండు పడవల మీద కాలు వేయకూడదని పూర్తిగా సివిల్స్‌పై దృష్టి సారించమని సలహా ఇచ్చారు. ఢిల్లీలోని ఏఎల్‌ఎస్, వాజీరామ్ కోచింగ్ సెంటర్లలో చేర్పించారు. చిన్నన్నయ్య రవికుమార్ అమెరికాలో ఉంటూనే నన్ను ప్రోత్సహించేవారు. ఇక మా వదినగారైతే ఎలాగైనా ఐఏఎస్ కొట్టి తీరాలన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహాన్ని మరువలేను.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను.. కానీ
కాలం మారినా గాంధీ సిద్ధాంతం నిత్యనూతనం. ఆయనను మించిన మేనేజిమెంట్ గురూ ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఉండరు. ఆయన చెప్పిన నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ముఖ్యంగా సమయపాలన ఆయన అనుసరించిన విధానంలో ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలను దగ్గర నుంచి పరిశీలించాను కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై నాకు ఒక అవగాహన ఉంది. ప్రాంతాలవారీ అవసరాలను గుర్తించడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపడతా.

ఇష్ట‌మైన‌వి ఇవే..
వారానికి ఒక రోజు సినిమాలు చూడ్డానికి కేటాయిస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఇతర భాషా సినిమాలు చూస్తా. చిన్నప్పటినుంచి నాకు ఇది అలవాటు. కేంద్రీయ విద్యాలయంలో చదవడం వల్ల ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ సా ద్యమయ్యింది. టేబుల్ టెన్నిస్‌లో కేవీ సంఘటన్ రీజనల్ లెవెల్‌లో పాల్గొన్నా. క్రికెట్ బాగా ఆడతా. కాలేజీ తరుపున కంపెనీ తరుపున ఆడాను.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

ఈ మార్కుల తేడాతో అవకాశం కోల్పోయాను.. కానీ
సివిల్స్ రాయాలని నేను 2011 జనవరిలో నిర్ణయం తీసుకున్నాను. అతి తక్కువ సయయంలోనే ప్రిలిమ్స్ పాసయ్యాను కాబట్టి నా లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకం కలిగింది. రెండోసారి 2012లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. కాని 50 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయాను. ఇక మూడో సారి పట్టు వదల్లేదు. గతంలో చేసిన తప్పులు సరిచేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. దీంతో సివిల్స్‌లో ఏదో ఒకటి గ్యారంటీ అనుకున్నా. ఐఏఎస్ రావడం నాకు చాలా సంతోషం కలిగింది.

ఈ పుస్త‌కాల‌ను చ‌దివాను..
మెయిన్స్‌కి సంబంధించి జనరల్ స్టడీస్‌కి వెయిటేజి ఎక్కువగా ఇచ్చారు. దీంతో దినపత్రికలు, మాగజైన్స్‌లో వచ్చే ఆర్టికల్స్ బాగా స్టడీ చేశా. ఫ్రంట్‌లైన్, సివిల్ సర్వీసెస్ టైమ్స్/ కాంపిటీషన్ విజార్డ్/ సివిల్ సర్వీసెస్ క్రానికల్ చదివితే చాలు. ఇందులో అప్‌డేటెడ్ సమాచారం లభ్యం అవుతుంది. ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం 6-12 తరగతుల వరకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు చదివాను.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నా ప్రిప‌రేష‌న్‌లో..
నేను మేనేజ్‌మెంట్ స్టూడెంటు అవడం వల్ల ఇంటర్వ్యూలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. రహదార్లు, విద్య, విద్యుత్, వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో పని చేసినపుడు మీరు ఏ సమస్యను ముందుగా పరిష్కరిస్తారు? అని ప్రశ్నించారు. ముందుగా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తానని చెప్పా. ఆరోగ్యంగా ఉంటే పనిచేసే శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందనేని నా అభిప్రాయం. ప్రతి రోజు 8-10 గంటలు చదివేవాడిని. హిందూ, ఎకనామిక్ టైమ్స్ వంటి పత్రికలు, రాజ్యసభ-లోక్‌సభ టీవీలోని వివిధ సమకాలీన అంశాలపై వచ్చే డిబేట్స్ ఫాలో అయ్యేవాడిని. ఆలిండియా రేడియోలో ప్రసారం చేసే డిబేట్స్ ఉపయోగపడ్డాయి.

కుటుంబ నేపథ్యం :
తండ్రి కిల్లి శంకర్రావు ఎంఈఎస్‌లో అసిస్టెంట్ గారిజన్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేశారు. తల్లి పార్వతీదేవి గృహిణి. పెద్దన్నయ్య ప్రకాష్ ఎంఈఎస్‌లోనే ఇంజినీర్. చిన్నన్నయ్య రవికుమార్ అమెరికాలో వెటర్నరీ ఆఫీసర్.

Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా ప‌నిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..

నా చదువు..
విశాఖ ఎన్‌ఏడీలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి వరకు.. ఇంటర్ బీవీకే జూనియర్ కళాశాలలో.. కోల్‌కతా ఐఐటీలో బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). ఆలిండియా లెవెల్‌లో 21వ ర్యాంకు సాధించారు. క్యాట్ పరీక్షలో 97 పర్సంటైల్ సాధించి ముంబాయి ఎన్‌ఐటీలో ఎంబీఏ చేశారు.

నేను చేసిన‌ ఉద్యోగాలు..
క్యాంపస్ ప్లేస్‌మెంటులో విప్రో కంపెనీకి ఎంపికై బెంగళూరులో 2004లో చేరి 21 నెలలు ఉద్యోగం చేశారు. నిట్‌లో ఎంబీఏ పాసయ్యాక కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం లభించడంతో ఇంగ్లండ్‌లో కొన్నాళ్లు పనిచేశారు.

Success Story: రిక్షావాలా కుమారుడు.. ఐఈఎస్ ఆఫీస‌ర్ అయ్యాడిలా..

ఫ‌స్ట్‌ ర్యాంక్‌..
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రథమ ర్యాంకరుగా విశాఖ వాసి చంద్రశేఖర్ ఐఏఎస్ క్యాడరుకు ఎంపికయ్యారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచి సివిల్స్ రావడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. 

సివిల్స్‌లో విజయానికి పండంటి పది సూత్రాలు..
➤ సివిల్స్ రాయాలనుకుంటే హార్డ్ వర్క్, ఆత్మ విశ్వాసం, ఓపిక అవసరం.
➤ ప్రజా సేవ చేయాలనే తపన ఉంటేనే ఇందులోకి రావాలి.
➤ అపజయాలను కూడా విజయానికి ఉపకరణాలుగా మలచుకోగలగాలి.
➤ సంపాదన కోసం ఇందులోకి రాకూడదు. ఐఏఎస్ అనేది అతి పవిత్రమైన ప్రజాసేవా వేదికలాంటిది.
➤ పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలి.
➤ నిరంతర సాధనతో అప్‌డేటెడ్ సమాచారాన్ని సేకరించుకోవాలి.
➤ ఆప్షనల్‌గా మనకు ఇష్టపడే సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలి. దీనికి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంటుందో లేదో చూసుకోవాలి
➤ టైమ్ మేనేజ్‌మెంటును తెలుసుకోవాలి. ఇది పరీక్ష రాసేటపుడు చాలా ఉపయోగపడుతుంది.
➤ శిక్షణలో చెప్పే అంశాలకు అనుగుణంగా మ్యాగజైన్సు, దినపత్రికల్లో లభ్యమయ్యే సమాచారాన్ని నోట్సు సొంతంగా తయారు చేసుకోవాలి.
➤ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు పూర్తి విశ్వాసంతో వెళ్లాలి. నిరాశకు తావివ్వకూడదు.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 11 May 2022 04:53PM

Photo Stories