Skip to main content

IAS Success Story : నా తండ్రిని చూసే.. ఇటు వ‌చ్చా.. సొంత ప్రిప‌రేష‌న్‌తోనే సివిల్స్ కొట్టా.. ఐఏఎస్ అయ్యానిలా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌ ప‌రీక్ష‌లో విజ‌యం సాధించాలంటే క‌ఠోర‌ శ్ర‌మ ఎంతో అవ‌స‌రం. అలాగే యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌లో ర్యాంక్ కొట్ట‌డం ఎంత కష్టమో.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎదుర్కొనడం కూడా అంతే కష్టం.
arth jain ias success story telugu
arth jain ias

అలాంటిది మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్త్ జైన్ మాత్రం ఏకంగా సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌ ఆర్త్ జైన్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

IAS Success Story : జీవితాన్ని ఇలా చూస్తే.. ఏదైనా ఈజీనే.. ఫెయిల్ అయితే..

నా తండ్రిని చూసే.. ఇటు వ‌చ్చా..

arth jain ias success story in telugu news

ఆర్త్ జైన్.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని సదర్ బజార్‌లో నివాసి. తండ్రి ముఖేష్ జైన్ IPS ఆఫీస‌ర్‌. చిన్నతనం నుంచే తన తండ్రి పనిని ద‌గ్గ‌రి నుంచి చూశాడు. సమాజంలో ప్రతిష్టాత్మకమైన వృత్తిగా సివిల్ సర్వీసును భావిస్తారు. ముఖ్యంగా ఆర్త్ జైన్.. త‌న తండ్రి నుంచి సివిల్ సర్వీసుకు వెళ్ళడానికి ప్రేరణ పొందాడు.

కాలేజీకి వెళ్ళినప్పుడు.. చాలామంది యూపీఎస్సీ(UPSC) పరీక్ష సిద్ధమవ్వడం చూశాడు. తాను ఎందుకు ప్రయత్నించకూడదు అని అనుకున్నాడు. అంతే మూడో సంవత్సరం నుంచే యూపీఎస్సీ కోసం కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు.

➤☛ IAS Officer Success Story : ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ .. ప్ర‌స‌వించిన 14 రోజుల‌కే పసిబిడ్డతో.. ఆఫీస్‌కు..

నా సివిల్స్ ప్రిప‌రేష‌న్ ఇలా..

arth jain ias story in telugu

అర్త్ జైన్.. మూడున్నర సంవత్సరాలు పాటు యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ కోసం సన్నద్ధమయ్యారు. కాలేజీలో చ‌దివే స‌మ‌యంలో.. మూడవ సంవత్సరం నుంచే తన ప్రిపరేషన్ ప్రారంభించాడు. అది అనుకున్నంత‌ సులభం కాదు. కానీ ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఈయ‌న ఎందుకో స్నేహితులను కలవడానికి ఇష్టపడలేదు. సివిల్స్‌ ప్రిప‌రేష‌న్‌పై పోరాటం చేశానని.. ఎన్నో త్యాగాలు  చేస్తే.. కానీ తనకు చివ‌రికి ఈ ఫలితం దక్కింద‌న్నాడు.

➤☛ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

ఒక్కోసారి కనీసం సిలబస్‌లో లేనివి కూడా..
అర్త్ జైన్.. మొదటి ప్రయత్నంలో కనీసం ప్రిలిమ్స్ కూడా ఉత్తీర్ణత సాధించలేదు. అయితే.. నిరుత్సాహ పడకుండా ప్రయత్నించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. యూపీఎస్సీ(UPSC) సివిల్స్‌ ర్యాంకు సాధించడం ఎంత కష్టమో.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎదుర్కొనడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇవే ప్రశ్నలు అడుగుతారు అని చెప్పలేం. ఒక్కోసారి కనీసం సిలబస్‌లో లేనివి కూడా అడిగే అవకాశం ఉంది. నా విష‌యంలో  ఇలాగే జ‌రిగింది. అయినప్పటికీ ధీటుుగా సమాధానం చెప్పి.. ఐఏఎస్ సాధించాను.

➤☛ IAS Officer Success Story : నాన్న డ్రైవ‌ర్‌.. కూతురు ఐఏఎస్‌.. చ‌ద‌వ‌డానికి డ‌బ్బులు లేక‌..

యూపీఎస్సీ(UPSC) సివిల్స్‌కు సిద్ద‌మ‌య్యే వారు.. ఇవి పాటిస్తే చాలు..
మీరు మీ ప్రిప‌రేష‌న్‌ను క్రమం తప్పకుండా కొన‌సాగించాలి. మీ మానసిక ఆరోగ్యం ఏ విధంగానూ ప్రతికూలంగా ప్రభావితం కాకూడదు. అటువంటి పరిస్థితిలో, సోషల్ మీడియాకు సంబంధించి అభ్యర్థులు మధ్య మార్గాన్ని తీసుకోవాలి. అభ్యర్థి అన్ని రకాల సోషల్ మీడియాను ఉపయోగిస్తే, పరధ్యానంలో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు పరీక్షకు సిద్ధం కావడానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

➤☛ UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

కానీ మనం సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతిదాన్ని పూర్తిగా తొలగిస్తే.., అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే వాట్సప్ వంటి కొన్ని విషయాలను ఉంచడం ముఖ్యం. తద్వారా మీరు స్నేహితులు, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. వారితో సన్నిహితంగా ఉండండి. అనవసరమైన టీవీ, సినిమాలపై సమయం వృధా చేయవద్దు.

సివిల్స్‌కు కోచింగ్ అవ‌స‌ర‌మా..?

arth jain ias motivation story in telugu

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మాచారం చాలా వ‌ర‌కు అందుబాటులో ఉంది. మీరు కోరుకున్న వనరులను ఇక్కడ ఈజీగానే పొందవచ్చు. ఉపాధ్యాయులు నిర్దిష్ట సబ్జెక్ట్ గురించి ఉచితంగా సమాచారాన్ని అందించే కొన్ని యూట్యూబ్ (YouTube) ఛానెల్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌.. 

ఆన్‌లైన్ ఉన్న స‌మాచారం ఖచ్చితమైన స‌మాచార‌మో.. కాదో తెలుసుకోని చ‌ద‌వండి. ఇది విద్యార్థికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఏదైనా సబ్జెక్ట్ మెటీరియల్‌ని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే, ఆన్‌లైన్‌లో ఉచితంగా బోధించే టీచర్లు చాలా మంది ఉన్నారు. మీరు రోజువారీ కరెంట్ అఫైర్స్‌లో సెర్చ్ చేస్తే, మీకు అరగంట వీడియో వస్తుంది. రోజువారీ వార్తాపత్రిక వార్తల విశ్లేషణ అందుబాటులో ఉంటుంది. ఇది మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది. అలాగే యూట్యూబ్‌లో అనేక కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మాడ్యూల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోచింగ్‌లో చేరాలా వద్దా అనే విషయం చాలా మంది మదిలో మెదులుతుంది. కోచింగ్ క్లాసుల విషయానికొస్తే, ఇది మీకు దిశను చూపుతుంది. కానీ మీరు ఆ దిశగా వెళ్లాలి. కోచింగ్ అనేది మార్గదర్శక కాంతి లాంటిది. స్వీయ అధ్యయనం ఉత్తమ పరిష్కారం.

☛ IAS Officer Radhika Success Story : రాధిక.. ఐఏఎస్‌.. చరిత్ర సృష్టించింది.. ఈ బ‌ల‌మైన‌ సంకల్పంతోనే..

నా ఇంట‌ర్య్వూలో చాలా క‌ష్టంగా.. ఇష్టంగా..upsc civils interview questions in telugu
నా ఇంటర్వ్యూ దాదాపు 25 నిమిషాలపాటు సాగింది. సిలబస్‌లో లేని ప్రశ్నలను అడిగారు. అయినప్పటికీ ధీటుుగా సమాధానం చెప్పాన‌న్నారు.
నా ఇంట‌ర్య్వూలో అడిగిన కొశ్చ‌న్స్ ఇవే..
☛ ప్ర‌శ్న: మీరు ఆవిష్కరణను ఎలా కొలుస్తారు?
☛ ప్ర‌శ్న: CRPC, IPC మధ్య తేడాలు ఏమిటి?
☛ ప్ర‌శ్న: క్రూయిజ్ క్షిపణి , బాలిస్టిక్ క్షిపణి మధ్య తేడా ఏమిటి?
☛ ప్ర‌శ్న: సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుంది..?
☛ ప్ర‌శ్న: ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా అధ్యయనాల మార్గం సులభం అవుతుందా?

➤☛ UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే..

Published date : 17 Mar 2023 04:01PM

Photo Stories