Skip to main content

Abhilasha Abhinav IAS Success Story : ఖమ్మం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌.. స‌క్సెస్ స్టోరీ.. ఎక్క‌డ ప‌నిచేసిన కూడా..

ఎక్క‌డ ప‌నిచేశాము అనేది కాదు.. ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాము అనేది ముఖ్యం. ఏ అధికారికైన ఇదే మంచి పేరు తెస్తుంది. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు.. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఇటీవ‌లే నియమితులైన 2018వ బ్యాచ్‌కు చెంది ఐఏఎస్ అధికారిని అభిలాష అభినవ్‌.
Abhilasha Abhinav IAS Story In Telugu
Abhilasha Abhinav IAS Success Story

ఈమె ఎక్క‌డ ప‌నిచేసిన కూడా మంచి పేరు తెచ్చుకోవ‌డం ఈ ప్ర‌త్యేకత. ఈ నేప‌థ్యంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 

Abhilasha Abhinav IAS Family 2023

అభిలాష అభినవ్‌.. బిహార్‌లోని పట్నా సమీపంలోని షోహసరి పట్టణంలోని హబీబ్‌పుర‌కు చెందిన వారు. ఆమె తండ్రి గోల్‌నాథ్‌ సర్కార్‌. ఈయ‌న విశ్రాంత ఐపీఎస్‌ అధికారి. తల్లి కల్యాణి సిన్హా.

☛ Durishetty Anudeep, IAS Success Story : హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌.. అన్నింట్లోనూ టాప్‌.. ఈయ‌న స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

ఎడ్యుకేష‌న్ :
అభిలాష అభినవ్‌.. 2005లో మెట్రిక్‌ పాస్ అయ్యారు. 2007లో బొకారోలో +2 తరగతి పూర్తి చేశారు. పదో తరగతి 91శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్‌ 85శాతం మార్కులతో 2007లో ఉత్తీర్ణత సాధించారు. బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) నావి ముంబైలోని ఏసీ పటేల్‌ కళాశాలలో 2012లో పూర్తిచేశారు. అభిలాష వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు పెయింటింగ్‌ హాబీగా ఉంది.

చ‌ద‌వండి: 23 ఏళ్ల‌కే ఐఏఎస్‌... ఎలాంటి కోచింగ్ లేకుండానే క‌శ్మీర్ నుంచి స‌త్తాచాటిన యువ‌తి

ఉద్యోగాలు : 

Abhilasha Abhinav IAS Success Story in telugu

పుణేలోని ఐబీఎంలో రెండున్నరేళ్లు ఉద్యోగం చేశారు. అనంతరం దిల్లీలో సిండికేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేశారు. 2018వ బ్యాచ్‌కు చెందిన అభిలాష అభివన్‌కు 2020 ఆగస్టులో మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌ తొలి పోస్టింగ్‌ వచ్చింది. ఇక్క‌డ‌ పనిచేసిన మూడేళ్ల కాలంలో ఆమె మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఖమ్మం అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా మహబాబూబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్న అభిలాష అభినవ్‌ నియమితులయ్యారు.

చ‌ద‌వండి: జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

సివిల్స్‌లో మాత్రం..

Abhilasha Abhinav IAS Real Story in Telugu

అభిలాష అభినవ్‌.. 2014లో మొదటిసారి సివిల్‌సర్వీస్‌ పరీక్షలు రాసి విఫలం అయింది. 2016లో రెండోసారి పాసై 308 ర్యాంక్‌ సాధించి.. ఐఆర్‌ఎస్‌(ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌)కు ఎంపికయ్యారు. నాగ్‌పూర్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారిగా 9 నెలలు పని చేశారు. 2017లో మూడోసారి సివిల్స్‌ రాసి జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌ అయ్యారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత మొద‌టి సారిగా మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు.

☛ UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

Published date : 21 Jul 2023 07:26PM

Photo Stories