UPSC Civils Ranker Suraj Tiwari : ఓ ప్రమాదంలో కాళ్లు, చేయి కోల్పొయినా.. ఈ దైర్యంతోనే యూపీఎస్సీ సివిల్స్ కొట్టాడిలా..
ఈయనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికు చెందిన సూరజ్ తివారీ. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ సూరజ్ తివారీ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
సూరజ్ తివారీ.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికు చెందిన వారు. అతని తండ్రి రాజేష్ తివారీ వృత్తిరీత్యా టైలర్. బట్టలు కుట్టిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజేష్ తివారీకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రాహుల్ తివారీ మరణించగా.., చిన్న కుమారుడు రాఘవ్ తివారీ బీఎస్సీ చదివాడు. కుమార్తె ప్రియ.
ఎడ్యుకేషన్ :
సూరజ్ తివారీ.. ఢిల్లీలోని జేఎన్‌యూ(JNU) నుంచి బీఏ(BA) పూర్తి చేశారు. 2021లో బీఏ ఉత్తీర్ణతైన తర్వాత ఎంఏ(MA) చదివాడు. ఈయనకు చిన్నతనం నుంచే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలనే కల కనేవాడు. ఆ కల నెరవేర్చుకోవడానికి సూరజ్ తివారీ ఓ వైపు ఎంఏ చదువుతూనే.. మరోవైపు యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.
ఓ రైలు ప్రమాదంలో..
సూరజ్.. 24 జనవరి 2017న ఘజియాబాద్‌లోని దాద్రీలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తన అవయవాలను కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లతో పాటు కుడి చేతిని, ఎడమ చేతిలోని రెండు వేళ్లను కోల్పోయాడు. దాదాపు నాలుగు నెలలు పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుమారు మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఈ సమయంలో తన తండ్రి తన కోసం పడుతున్న కష్టాన్ని చూశాడు. దీంతో సూరజ్ కు తాను భవిష్యత్ లో ఏదైనా సాధించాలనే పట్టుదల వచ్చింది.
☛ IFS Officer Success Story : ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదని IFS ఉద్యోగం ఎంచుకున్నా..
ఆ రోజే..
తండ్రి టైలరింగ్ చేస్తూ తన వైద్యం కోసం పడుతున్న కష్టాన్ని చూసి మరింత పట్టుదలతో చదివి నేడు చరిత్ర పుటల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన సూరజ్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 917వ ర్యాంకు సాధించాడు. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా.. సూరజ్‌పై భారీగా ప్రశంసల వర్షం కురిపించారు. సూరజ్ చిన్న సైజు సెలబ్రెటీగా మారాడు.
సూరజ్ లాంటి కొడుకు ప్రతి ఇంట్లోనూ..
సూరజ్ సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. అంతేకాదు తన కుమారుడి విజయం గురించి సూరజ్ తండ్రి రాజేష్ తివారీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తన కుమారుడు నిరాశ పడలేదని.. భవిష్యత్ గురించి భయపడ లేదని మరింత పట్టుదలతో చదువుకున్నాడని చెప్పాడు. అంతేకాదు సూరజ్ లాంటి కొడుకు ప్రతి ఇంట్లోనూ పుట్టాలంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు రాజేష్ తివారి.
మరోవైపు.. కుమారుడి విజయం గురించి సూరజ్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ప్రమాదం జరిగిన తర్వాత కూడా ధైర్యం కోల్పోలేదు.. అంతేకాదు తమకు చింతించకండని.. నేను చాలా డబ్బు సంపాదిస్తాను అని మమ్మల్ని ప్రోత్సహించాడు. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు అంటూ.. తన కొడుకు సాధించిన విజయాన్ని ఆమె గర్వంగా చెప్పింది.
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత సూరజ్ సక్సెస్ జర్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సూరజ్‌ని అభినందిస్తూ.. పలువురు ప్రముఖులు ప్రసంశలు కురిపించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సూరజ్ ధైర్యానికి సలాం చేస్తూ అభినందించారు.
ఈ యువకుడు ఆచరణలో పెట్టి చూపించాడు..
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న మాటలను ఈ యువకుడు ఆచరణలో పెట్టి చూపించాడు. విధి వక్రీకరించి తన కాళ్ళను బలి తీసుకున్నా మొక్కవోని దీక్ష.., పట్టుదలతో నేటి యువతకు స్ఫూర్తిగా నిలచారు సూరజ్ తివారీ.
☛ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Tags
- suraj tiwari upsc 917 civils ranker
- suraj tiwari upsc success story
- UPSC Civils Ranker Success Story
- upsc ranker inspire story in telugu
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- Inspire
- upsc civils ranker success story in telugu
- civils ranker success stroy in telugu
- upsc ranker success story in telugu