Skip to main content

UPSC Civils Ranker: ఇందుకే సివిల్స్‌ రాశాను.. వారు మ‌న‌క‌న్నా గొప్పేం కాదు..

దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మే 30న విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
Amita, Civils Ranker
అమిత, సివిల్స్‌ ర్యాంక‌ర్‌

ఈ ఫ‌లితాల్లో తెలంగాణ‌కు చెందిన అమిత యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో ఆలిండియా 658 ర్యాంక్ సాధించారు. ఈ నేప‌థ్యంలో సివిల్స్ ర్యాంక‌ర్ అమిత స‌క్సెస్ స్టోరీ మీకోసం..

UPSC Civils Top Ranker Story: ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..

నాన్న వైద్యుడిగా పనిచేయడంతో చిన్నతనం నుంచి నాన్న దగ్గరకు వచ్చే గిరిజనులు, పేదవాళ్లను చూసి.. వారి కష్టాలు తీర్చాలని అనిపించేది.. పెద్దయ్యాక పేదలకోసం ఏదైనా చేయాలని ఆలోచన ఉండేది.. ఐఐటీ చదువుతున్నప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ ఆలోచన మరింత బలపడింది.. ఆ తర్వాత అమ్మ, నాన్నల ప్రోత్సాహం.. బావ సహకారంతో సివిల్స్‌లో 658 ర్యాంకు సాధించానంటున్న మానుకోట మణిహారం సభావట్‌ అమితతో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.. 

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

నా ఎడ్యుకేష‌న్ :
చిన్నప్పటి నుంచి ప్రత్యేకతలు ఏమీ లేకుండా అమ్మా నాన్నలు చెప్పింది వింటూ ఏడో తరగతి వరకు మహబూబాబాద్‌లో, తర్వాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో, ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీరింగ్‌ చదివాను.. అయితే  పరీక్షలు వచ్చినప్పుడు కాకుండా ఎప్పటి విషయాలు అప్పుడు చదవడం చిన్ననాటి నుంచి అలవాటు దాంతో ఏ పరీక్షనైనా భయం లేకుండా రాసేదాన్ని..

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

ఇందుకోసమే సివిల్స్‌ రాశా..

UPSC 2022 Topper


గిరిజనులు ఎక్కువగా ఉండే మానుకోటలో పుట్టి పెరిగాను. నేనూ గిరిజన బిడ్డనే కావడంతో వారు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను చూసి వారికి ఏదైనా చేయాలని ఆలోచిందే దాన్ని. కాన్పూర్‌లో ఐఐటీ చదువుతున్నప్పుడు మా కోర్సులో భాగంగా ఎన్‌జీఓలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు మహిళలు, దివ్యాంగులు, పిల్లల సమస్యలు వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం అలవాటైంది. మహిళలపై వేధింపులు చూసినప్పుడల్లా.. వీటిని నివారించే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అందుకోసమే సివిల్స్‌ రాశాను. 

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే..

నా సివిల్స్ ప్రిప‌రేష‌న్‌లో..
నా ఆలోచనను అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు. అమ్మతో నాకు ఎక్కువ అనుబంధం.. సివిల్స్‌ రాస్తానంటే ధైర్యం చెప్పింది.. 2018లో 975వ ర్యాంకు వచ్చింది.. డిఫెన్స్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదవడం ప్రారంభించాను.. ఇంతలోనే కోవిడ్‌ మహమ్మారితో ఇల్లు విడిచి వెళ్లలేని పరిస్థితి.. ఈ పరిస్థితిలో నాకు ఏ ఇబ్బంది రాకుండా చూసింది అమ్మ. ఆన్‌లైన్‌లో చదడం ప్రారంభించాను. మెటీరియల్, ఇంటర్వ్యూ ఎలా చేయాలి.. ఏ అంశాలు చదవాలి అనే సందేహాను నివృత్తి చేసింది. బావ దేవేందర్‌ సింగ్‌(ఐఏఎస్‌ మహారాష్ట్ర కేడర్‌). ఇలా అమ్మానాన్న, బావ సహకారం నన్ను మరిన్ని గంటలు చదివేలా చేసింది.. ఇలా రోజుకు 12 గంటలకు పైగా చదివి.. ఈ సారి 658వ ర్యాంకు సాధించాను.

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

నా ఇంటర్వ్యూలో ఎక్కువ‌గా..
నాకు రిటన్‌ టెస్ట్‌కన్నా.. ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశం వచ్చింది. నేను సెంట్రల్‌ డిఫెన్స్‌లో ఉద్యోగం చేయడంతో ఇంటర్వ్యూ చేసే పెద్దలు నన్ను సహ ఉద్యోగిగా చూశారు. గిరిజనులు, జీవన విధానం, సామాజిక సేవా మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీంతో నాకు సమాధానాలు చెప్పడం సులువైంది.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

ఇతరులు మనకన్నా గొప్పేం కాదు.. కష్టపడితే..
మానుకోట.. మారుమూల జిల్లా.. ఇక్కడ చదివిన వాళ్లు ఏం సాధిస్తారు. అనే ఆలోచన ఇక్కడి విద్యార్థులు, యువతలో ఉంటుంది.. కానీ, లక్ష్యం ఎంచుకొని శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదు. మనమేమీ తక్కువ కాదు.. ఇతరులు మనకన్నా గొప్పేం కాదు.. కష్టపడితే విజయం వరిస్తుంది. యువత భయ పడకుండా కష్టపడి ఉన్నతస్థానాల్లో ఉండాలనేది నా ఆకాంక్ష. నా చిన్ననాటి స్వప్నం సాకారమయ్యే రోజు వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్‌తో ఐపీఎస్‌ లేదా.. ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తా.. ముఖ్యంగా మహిళలు, గిరిజనులకు సహాయ పడేందుకు ప్రయత్నం చేస్తా.

Civils Ranker Success Story: ఫెయిల్ అయ్యా.. కానీ నా పోరాటాన్ని మాత్రం ఆప‌లేదు.. అందుకే స‌క్సెస్ అయ్యా..

బాధ అనిపించేంది.. కానీ..

Civils Topper Sabhavatya Amita Family


పెద్ద పాప డాక్టర్, అమిత చిన్ననాటి నుంచి వినూత్నంగా ఆలోచించేది.. అందుకోసమే సివిల్స్‌ రాస్తా ను అనగానే ధైర్యం చెప్పాం.. బిడ్డ రోజు నిద్రపోకుండా చదువుతుంటే బాధ అనిపించేంది.. కానీ ఆమెతోపాటు మేం మేల్కొని ఉండి సాయం చేసేవాళ్లం.. మంచి ర్యాంకు సాధించినందుకు గర్వ పడుతున్నాం..   
                                                  – డాక్టర్‌ భీంసాగర్, భూ లక్ష్మి, అమిత తల్లిదండ్రులు 

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

Published date : 14 Jun 2022 01:25PM

Photo Stories