Success as Collector: కలెక్టర్‌గా విజయం సాధించిన గిరిజన విద్యార్థి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేటకు చెందిన గిరిజన బిడ్డ అజ్మీరా సంకేత్‌కుమార్. తన ఆశయం కోసం కష్టపడి చదివి ఆలిండియా స్థాయిలో 35వ ర్యాంకు సాధించాడు.
Civils Inspirational Journey: చిన్నప్పటి ఆశయం.. సివిల్స్‌లో విజయం
దేశస్థాయిలో కర్ణపేట, జిల్లా పేరును మార్మోగించాడు. తండ్రి అజ్మీరా ప్రేమ్‌సింగ్‌నాయక్ ఉద్యానవన శాఖ ఉద్యోగి కాగా, తల్లి సవిత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. సంకేత్‌కుమార్ ప్రాథమిక విద్యను కర్ణపేట, ఇంటర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీ, ఐఐటీ(ఢిల్లీ)లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదే కాలేజీలో మాస్టర్ ఆఫ్ రీసెర్చ్(ఎమ్ఆర్)లో బంగారు పతకం సాధించాడు. ఏడాదిపాటు జపాన్‌లోని ఓ కంపెనీలో రీసెర్చ్ ఇంజినీర్‌గా చేశాడు. ఐఏఎస్ కావాలనే దృఢ సంకల్పంతో సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు.
2021లో చేసిన తొలిప్రయత్నంలో భాగంగా పరీక్ష రాసి విఫలమైయ్యాడు. అయినా, మళ్ళీ 2022లో మరోసారి ప్రయత్నించి అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్‌కు అర్హత పొందాడు. 'గిరిజనులకు, నిరుపేదలకు సేవ చేసేందుకు కలెక్టర్ కావాలనుకున్నా ఆశ ఉంది.. ఆ మేరకు కష్టపడి చదివాను.. ఆల్ ఇండియా స్థాయిలో 35వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది..'' అంటూ సంకేత్‌కుమార్ 'సాక్షి'తో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Inspiring Success Story: లోపాన్ని లెక్కచేయకుండా.. అద్భుతం సృష్టించిందిలా..
కొడుకు విజయంపై తల్లిదండ్రుల హర్షం..
కలెక్టర్ కావాలనే ఆకాంక్షను నెరవేర్చేందుకు మేము ప్రోత్సహించాం. మొదటి ప్రయత్నంలో రాకపోయినా బాధపడకుండా లక్ష్యం సాధించడం కోసం రెండోసారి మంచి ర్యాంకు సాధించాడు. తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నందుకు తల్లిదండ్రులుగా ఎంతో గర్విస్తున్నాం.
Uma Harathi: ఎన్నో ఓటములు చూసి గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించానిలా..
-అజ్మీరా ప్రేమ్‌సింగ్, సవిత