Civils Inspirational Journey: చిన్నప్పటి ఆశయం.. సివిల్స్‌లో విజయం
సివిల్స్ సాధించాలనే తపనతోపాటు అందుకు తగ్గిన ప్రణాళికతో చదివితే గమ్యాన్ని చేరడం సులభమని నిరూపించాడు ఈ యువకుడు.. నల్లగొండ ఆణిముత్యం దామోర హిమవంశీ. సివిల్స్‌పై ఉన్న ఇష్టంతో తన గమ్యంగా మార్చుకొని ఎప్పటికైనా సాధించాలనే తపన పట్టుదలతో పరీక్షలు రాసి, విఫలం అయినా కూడా పట్టువీడకుండా ప్రయత్నం చేస్తూ కృషి చేసి మొత్తానికి యూపీఎస్‌సీ వారు విడుదల చేసి సివిల్స్ ఫలితాలానుసారం తాను అనుకున్న మార్కులు సాధించి జిల్లా కీర్తిని పెంచారు ఈ విద్యార్థి.
Success Story: ఒకప్పుడు సామాన్యుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు.. కారణం యూట్యూబ్‌లోని కామెడీ వీడియోలే..!
తన కృషి, సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైన గమ్యాన్నైనా సులభంగా చేరుకోవచ్చని నిరూపించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తండ్రి డాక్టర్ కావడంతో తాను సివిల్స్ వైపు వెళ్తే బాగుంటుందని బాల్యంలో నిర్ణయించుకున్న కల ఇది. ఈ దారిలోనే నడిచి కలను నెరవేర్చుకునేందుకు ఐఐటీ రూర్కీ వేదికైంది.
Young Man in Civils: బస్సు కండక్టర్ కుమారుడికి టీఎస్ఆర్‌టీసీ ఎండీ అభినందనలు.. కారణం?
సీనియర్స్ సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో తాను సైతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ చదువుతూ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో సివిల్స్ రాసి విఫలమయ్యాడు. వెనుకంజ వేయకుండా ఇంట్లోనే ఉంటూ తాను సొంతంగా ప్రణాలికను తయారుచేసుకొని, చదివి నాలుగో పర్యాయం సివిల్స్ రాసి 548వ ర్యాంక్‌తో విజయం పొందాడు. తన విజయ సాధనపై స్పందిస్తూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని కైవసం చేసుకున్నట్లు హర్షం వ్యక్తం చేశాడు.
Women Success Story in Civils: జిల్లా స్థాయిలో యువతి.. సివిల్స్‌లో సాధించాలన్న ఆశయంతోనే..
కుటుంబం.. విద్యాభ్యాసం..
నల్గొండ జిల్లా కేంద్ర వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ దామెర యాదయ్య- నిర్మల కుమారుడు హిమవంశీ. తన బాల్య విద్యాభ్యాసం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ హైస్కూల్‌లో 1నుంచి 10వ తరగతి వరకు చదివాడు. హైదరాబాద్‌లో నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి జేఈఈలో ఉత్తమ మార్కులతో సత్తా చాటాడు. 2013లో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఐఐటీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ జియోఫిజికల్ టెక్నాలజీలో సీటు సాధించాడు.
విజయ ప్రయాణం..
2018 బీటెక్ కమ్ ఎంటెక్ పూర్తికాగానే తొలి ప్రయత్నంగా 2019లో యూపీఎస్సీ పరీక్ష రాసి విఫలమయ్యాడు. అయినప్పటికీ కచ్చితంగా సాధించాలనే ఆశయంతో సీనియర్స్ సలహాలు సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నల్గొండలోని తన నివాసంలో ఉంటూనే సొంతంగానే అన్ని విషయాలను పరిశీలిస్తూ, ప్రతీ విషయాన్ని సమకూర్చుకొని తనకు తానుగానే పుస్తకంలో రాసుకొని చదివేవాడు. అలా, ప్రిపేర్ చేసుకుంటూ చదివి 2020, 2021లో మళ్లీ పరీక్ష రాశారు. అయినా రాకపోవడంతో తిరిగి నాలుగోరాసి ప్రయత్నం చేసి పరీక్షను రాశారు. ఇక తాను చేసిన నాలుగవ ప్రయత్నంలో తనకు ఫలితంగా 548 ర్యాంక్ సాధించాడు.. తన కలను సాకారం చేసుకున్నాడు.
success story: చదువుతూనే క్రీడల్లో సాధించింది ఎన్నో పతకాలు.. ఎలా అంటే..
తన విజయంపై హిమవంశీ హర్షం..
మా నాన్న యాదయ్య 'పిల్లల' వైద్యులు. అమ్మ నిర్మల గృహిణి. నాన్న డాక్టర్ కావడంతో చిన్నప్పుడే నువ్వు కలెక్టర్ అయితే బాగుంటుందని చెప్పారు. ఇంట్లో అప్పుడప్పుడు అమ్మానాన్నలు గుర్తు చేస్తూనే ఉండేవారు. అలా నాలో సంకల్పం బలమైన బీజంగా నాటుకుంది. ఇంటర్మీడియెట్ తర్వాత ఐఐటీ రూర్కీలో చేరగానే సీనియర్స్ సివిల్స్ చదువడం చూశా. ఇక్కడే మరింత చదువాలని నిర్ణయించుకొని అమ్మానాన్నకు చెప్పాను. నువ్వు బాగా చదువుకోమని స్పందించారు. అదే స్ఫూర్తితో ఓవైపు ఇంజినీరింగ్ చదవుతోపాటు మరో వైపు సివిల్స్‌ను సాధించాలంటే ఎలా..! అనే విషయాలను సీనియర్స్ ద్వారా తెలుసుకున్నాను.
2018లో ఇంజినీరింగ్ పూర్తికాగానే తొలి ప్రయత్నాన్ని చూపినా ఫలితం దక్కలేదు. 2019లో సివిల్స్‌కు ప్రిపేర్ అయినప్పటికీ రాలేదు. కానీ, మా అమ్మానాన్న నీలో సత్తా ఉంది చదువాలని ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో నల్గొండలో మా ఇంట్లోనే ఉంటూ సొంత నోట్స్ తయారుచేసుకుంటూ సిద్ధమై 2020, 2021, 2022లో రాసి దేశంలో 548 ర్యాంక్‌తో విజయం సాధించా. కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందనే ఆలోచన ఉండకూడదు. అదే నేను చేశాను. రోజుకు 8 నుంచి 9 గంటలు మాత్రమే చదివేవాడిని. తర్వాత అమ్మానాన్నతో సంతోషంగా గడిపేవాడిని. ఆత్మ విశ్వాసంతో చదివితే ఇందులోనైనా సత్తా చాటడం సులభం.