Young Man in Civils: బస్సు కండక్టర్ కుమారుడికి టీఎస్ఆర్‌టీసీ ఎండీ అభినందనలు.. కారణం?
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. ఈసారి సివిల్స్‌లో మహిళలు సత్తా చాటారు. మొదటి నాలుగు ర్యాంకులను వారే సొంతం చేసుకున్నారు. కాగా, ఎందరో ఈ పరీక్షల్లో నెగ్గగా అందులో చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. వారూ ఈ పరీక్షల్లో రాణించి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు.
వారందరిలో ఒకరు సిద్ధలింగప్ప.. కర్ణాలక ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కరసిద్ధప్ప కుమారుడే ఈ యువకుడు సిద్ధలింగప్ప. ఇతను కర్ణాటకలోని దర్వాడ జిల్లాకు చెందినవాడు. సాధారణ బస్సు కండక్టర్ అయినప్పట్టికి తన కుమారుడిని గొప్ప స్థానంలో చేర్చాడు. ప్రస్తుతం ఈ విజయంతో ఇద్దరు తండ్రి కొడుకులు అందరి ప్రశంసలను అభినందనలను అందుకుంటున్నారు.
UPSC Rankers: ఈ ఆశతోనే సివిల్స్‌లో సత్తా చాటారు విద్యార్థులు
కర్టాణక రాష్ట్రంలోని దర్వాడ జిల్లా అన్నెగిరికి చెందిన సిద్దలింగప్ప ఆలిండియా లెవల్‌లో 589 ర్యాంకుతో మెరిశాడు. పనిచేసుకుంటూ చదివి ఎలాంటి కోచింగ్, కోర్సులు తీసుకోకుండానే రెండో ప్రయత్నంలో అనుకున్నది సాధించడం అభినందనీయం. కోర్సులు లేదా కోచింగ్ సహకారం లేకుండా తన సొంతంగా పుస్తకాలు చదువుతూ, సోషల్ మీడియా వంటి సహకారంతో సివిల్స్‌కి సిద్ధం అయ్యారు. ఆయన సాధించిన ఈ ఘన విజయం ఎంతో మంది యువతకు స్పూర్తినిస్తుంది.
గెలుపుపై అభినందనలు..
సిద్ధలింగప్ప సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. "యూపీఎస్సీ ఫలితాల్లో వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (NWKRTC) కండక్టర్ కొడుకు మెరిశారు. కర్ణాటకలోని దర్వాడ జిల్లా అన్నెగిరికి చెందిన సిద్ధ లింగప్ప సివిల్స్‌లో ఆలిండియా 589వ ర్యాంకు సాధించారు.
Women Success Story in Civils: జిల్లా స్థాయిలో యువతి.. సివిల్స్‌లో సాధించాలన్న ఆశతోనే..
దేశంలోని ప్రజా రవాణా సంస్థ సిబ్బందికి ఇది గర్వకారణం. సిద్ధ లింగప్పను ప్రోత్సహించిన తన తండ్రి, బస్సు కండక్టర్ కరసిద్ధప్పకు గెలుపును సొంతం చేసుకున్న సిద్ధలింగప్పకు తెలంగాణ ఆర్టీసీ కుటుంబం తరపున శుభాకాంక్షలు" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
Tags
- civil ranker
- UPSC
- bus conductor
- civil ranker success story
- inspiration story
- Success Story
- success in civils
- young man success in civils services
- inspirational journey of civils ranker
- TSRTC Chairman
- Sajjanar ips
- appreciation
- CivilServicesAchievement
- SuccessJourney
- inspirational journey of civils ranker
- sakshi education success story