Skip to main content

Success Story : టెన్త్‌.. ఇంట‌ర్‌.. రెండుసార్లు ఫెయిల్‌.. కానీ రూ.2463 కోట్ల సంపాదించానిలా.. ఎలా అంటే..?

చాలా మంది విద్యార్థులు.. ప్ర‌స్తుతం టెన్త్‌, ఇంటర్‌.. ఇతర పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయంటే.. పాస్ అయితే సంతోషంగా ఉంటారు. అదే ఫెయిల్ అదే.. ఇక జీవితం అంతా అయిపోయింది.. ఏమి సాధించ‌లేము అని నిరుత్సాహప‌డుతుంటారు. కానీ ఇలాంటి వారికి జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినా, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహింవ‌చ్చ‌ని నిరూపించిన మిస్బా అష్రఫ్ అనే యువ‌కుడి సక్సెస్‌ స్టోరీ గురించి చెప్పాలి.
Misbah Ashraf Jar Story in Telugu

పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే... కానీ అదే సందర్భంలో ఫెయిల్‌ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్టు కాదు. మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలి అంటున్నాడు ఇత‌ను. రెండుసార్లు పెయిలైనా వ్యాపారంలో  రాణించి 29 ఏళ్లకే  కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాపౌట్ మిస్బా అష్రఫ్ సక్సెస్‌ జర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
మిస్బా అష్రఫ్.. మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బిహార్‌లో పుట్టి పెరిగాడు. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. అష్రాఫ్ ఐఐటీ ఢిల్లీలో చదువుతూ.. తొలి ఏడాదే కాలేజీ మానేశాడు. ఆ తరువాత Pulse.qa (YC), Pursuit, Toymail (YC),Spangle లాంటి సంస్థలలో పనిచేశాడు. మధ్యతరగతి కుటుంబం.. ఇటు ఆర్థిక ఇబ్బందులు అయినా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల సాకారానికి ఇందుకు తండ్రే స్పూర్తి. ఎలా అంటే..?  

☛ Success Story : అమ్మ క‌ష్టం ఫ‌లించింది.. నేను రూ.22000 కోట్లు సంపాదించా.. కానీ..

తండ్రి ఇచ్చిన ఈ ప్రేరణతోనే..
ఒక రోజు ఎప్పుడూ రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడు మిస్బా "ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు?"  దానికి చిరు మందహాసంతో చెప్పాడు ఇలా "నువ్వు నెమ్మదిగా నడిస్తే..కొట్టుకుపోతావు" అని. దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కల సాకారం కోసం వేగాన్ని పెంచాడు.

నాలుగేళ్ల తరువాత..
అలా సెప్టెంబరు 2013లో  ఐఐటీ-ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబోలా అనే కంపెనీనీ స్థాపించాడు. కానీ నాలుగు నెలలకే దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టప్  కావడం,ప్రభుత్వం పేమెంట్స్‌ లైసెన్స్‌రాలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత  ఆగస్ట్ 2017లోమార్స్‌పే అనే స్టార్టప్‌ లాంచ్‌ చేశాడు. ఇంతలో కోవిడ్‌ మహమ్మారి వచ్చింది. అయితే భారీగా  వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి 2021లో బ్యూటీ షాపింగ్ ,లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. 

☛ Real Life Success Story : ఈ కోరికతోనే.. ఓ సెక్యూరిటీ గార్డు.. ఏకంగా 23 సార్లు పోరాటం చేసి..చివ‌రికి పాస్ అయ్యాడిలా..

స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే..

Misbah Ashraf's story in telugu

ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే  మే 2021లో,  జార్ అనే తన మూడవ వెంచర్‌ను ప్రారంభించాడు. జార్‌లో నిశ్చయ్‌ మరో కో ఫౌండర్‌. అతను చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసరుగా ఉన్నారు. స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు , పెట్టుబడి. 18 నెలల తర్వాత, ఇది 11 మిలియన్ల వినియోగదారులను దాటింది. ఫిన్‌టెక్ సంస్థ 58 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.

కేవలం ఒక్క ఏడాదిలోనే.. 
జార్  రూ. 2463 కోట్లు (22.6 మిలియన్ డాలర్ల) ను సేకరించింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే  రూ. 2463 కోట్లకు చేర్చాడు కంపెనీని. అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ-మిలియన్ డాలర్ల  బిగ్‌డీల్‌ను సాధించాడు. ఇండియాలోని మైక్రో-సేవింగ్స్ యాప్ అయిన జార్, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ ఫండింగ్‌లో ఈ నిధులను సమకూర్చుకుంది.  అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ (2023)లో ఫోర్బ్స్ 30 అండర్  లిస్ట్‌లో  30 వాడిగా ఎంపికకావడం విశేషం.

☛ Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

10 రూపాయలతో..
ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో జార్ ను  స్టార్ట్‌ చేశారు.ఈ యాప్‌లో అందరూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంత చిన్న మొత్తంలో అయినా. 10 రూపాయలతో కేవలం 45 సెకన్లలో  24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌లో  పెట్టుబడి  పెట్టొచ్చు.

Published date : 02 Dec 2023 07:54AM

Photo Stories