Skip to main content

Real Life Success Story : ఈ కోరికతోనే.. ఓ సెక్యూరిటీ గార్డు.. ఏకంగా 23 సార్లు పోరాటం చేసి..చివ‌రికి పాస్ అయ్యాడిలా..

మ‌నం ప‌రీక్ష‌ల్లో ఒక‌టి.. రెండు సార్లు ఫెయిలైతేనే.. ఇక జీవితం అంతా అయిపోయింది అని డీలా ప‌డిపోతాము. కానీ 56 ఏళ్ల రాజ్‌కరన్.. ఏకంగా 23 సార్లు ఫెయిల్ అయినా సరే..పరీక్షలు రాస్తూనే ఉన్నాడు.
MSc Pass Rajkaran Baraua Story in Telugu

చివరికి ఎమ్సెస్సీలో ఉత్తీర్ణత సాధించడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచాడు. ఇంత‌కు ఈయ‌న ఎమ్సెస్సీ ఎందుకు పాస్ అవ్వాల‌నుకున్నాడు. ఈ ల‌క్ష్యం ఏమిటి మొద‌లైన వివ‌రాలు కింది స్టోరీలో చ‌ద‌వండి.

కొందరూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల చదువు కోలేకపోవడం జరగుతుంది. ఐతే కొందరూ మాత్రం పట్టువదలకు పెద్దయ్యాక అయినా ఆ కలను నెరవేర్చుకుని మరీ చదువుకున్న ఎందరో వృద్ధుల ఉదంతాలను చూశాం. కానీ ఒక మాస్టర్‌ డిగ్రీలో ఫెయిలై సబ్జెక్టులు ఉండిపోతే పాసయ్యేంత వరకు ఎదురు చూశారు రాజ్‌కరన్. అది కూడా దాదాపు సగం జీవితంపైనే ఓపిగ్గా గెలపు కోసం నిరీకిస్తూ పరీక్షలు రాయడం మాటలు గాదు కదా

ఈ కోరికతోనే..
జబల్‌పూర్‌కి చెందిన 56 ఏళ్ల రాజ్‌కరన్ అనే సెక్యూరిటీ గార్డుకి గణితంలో ఎంఎస్సీ చేయాలనేది ప్రగాఢ కోరిక. ఈ ఆలోచన 1996లో ఎంఏ పూర్తి చేసి పాఠశాల్లో విద్యార్థులకు గణితం బోధిస్తున్నప్పుడూ కలిగిందని చెబుతున్నాడు రాజ్‌కరన్‌. ఆ రోజుల్లో ఇలా ఎంఏ చేసిన వాళ్లు ఎంఏ మ్యాథ్స్‌ కూడా చేసే ఆప్షన్‌ ఉండటంతో తాను అదే ఏడాది జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో గణితంలో ఎంఎస్సీ మ్యాథ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించాడు.మ్యాథ్స్‌లో ఎంఎస్సీ ఎంత కష్టం అన్నది గ్రహించకుండా కేవలం తాను పిలల్లకు గణితం భోధించిన తీరుని అందరూ మెచ్చుకున్నారనే కారణంతో అనాలోచితంగా ఈ నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిపాడు రాజ్‌కరన్‌. అయితే తొలిసారిగా ఎమ్మెస్సీ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 1997లో హాజరై, ఫెయిలయ్యానని, అలా పదేళ్లలో మొత్తం ఐదు సబ్జెక్టులలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే పాసయ్యినట్లు తెలిపాడు. అయినా సరే ఇక వదిలేద్దా అని మాత్రం అస్సలు అనుకోలేదని చెప్పాడు. 

☛ YouTube : దేశంలో టాప్-10 స‌క్సెస్‌ యూట్యూబర్స్ వీరే..! వీరి సంపాద‌న చూస్తే..

ఎలాగైన గణితంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఎంఎస్సీ పరీక్షలకు ప్రిపేరైనట్లు తెలిపాడు. సుమారు 18 సార్లు ఫెయిల్‌ అయినట్లు తెలిపాడు. తొలిసారిగా 2020లో కోవిడ్‌ మహమ్మారి టైంలో ఫస్ట్‌ ఇయర్‌ పాసవ్వగా, 2021లో సెకండియర్‌ పాసవ్వడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

☛ Young Talented: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఈ కుర్రాడు..ఎలా అంటే..?

అతడి నెల జీతం రూ. 5000/- మాత్రమే.. అయినప్పటికి..
ఎట్టకేలకు గణితంలో ఎమ్మెస్సీ పూర్తి చేయాలన్న తన 25 ఏళ్ల తపస్సు ఫలించిందని చెప్పుకొచ్చాడు. అయితే 23 సార్లు ఎమ్మెస్సీ ఫెయిలైన వ్యక్తిగా పేపర్లో తన గురించి రావడంతో ప్రజలంతా తనను చులకనగా చూడటం మొదలు పెట్టారని, అదే తనలో ఎలాగైన గెలవలనే తపనను మరింత పెంచిదని చెప్పాడు కరణ్‌. అలాగే సెక్యూరిటీ గార్డుగా అతడి నెల జీతం రూ. 5000/- మాత్రమే. అయినప్పటికి వ్యక్తితగ ఖర్చులు కొంత డబ్బుని తన పీజీ కోసం కేటాయించేవాడినని చెప్పాడు. అలా ఈ మాస్టర్‌ డిగ్రీ కోసం అని  పుస్తకాలకు, పరీక్ష పీజులకైతే ఇప్పటి వరకు  దాదాపు రూ.2 లక్షలు పైనే ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ కల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు..

Rajkaran's Msc Success Stroy in Telugu

ఈ కల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు అతడు. పైగా తనని అందరూ పెయిల్యూర్‌కి ఉదహారణగా చూపుతూ తమ పిల్లలకి హేళనగా చెప్పేవారో బాధగా తెలిపాడు. అయితే తానెప్పుడూ అవేమీ పట్టించుకోకుండా ఈ డిగ్రీని పూర్తిచేయడమే తన ధ్యేయంగా భావించానని చెప్పాడు. అంతేగాదు ఓపిగ్గా.. విసుగు లేకుండా ప్రయత్నించేవాడు తప్పక విజయం సాధిస్తాడనే విషయం తెలుసుకున్నానని సగర్వంగా చెబుతున్నాడు. పైగా ఈ లక్ష్యాన్నే తాను పెళ్లి చేసుకున్నానని మరో పెళ్లాం ఎందుకని చమత్కారంగా మాట్లాడాడు రాజ్‌కరణ్‌. నిజంగా రాజ్‌కరణ్ పోరాటంకు సెల్యూట్ చేయాల్సిందే. 

☛ Special Story: ఆ ఊరు ఊరంతా యూట్యూబర్సే... నెల‌కు ల‌క్షల్లో సంపాదిస్తున్న గ్రామ‌స్తులు... ఎక్క‌డంటే..

Published date : 28 Nov 2023 04:28PM

Photo Stories