Special Story: ఆ ఊరు ఊరంతా యూట్యూబర్సే... నెలకు లక్షల్లో సంపాదిస్తున్న గ్రామస్తులు... ఎక్కడంటే..
అయితే ఓ గ్రామంలో సుమారు 50 శాతం మంది యూ ట్యూబ్‌నే ఆధారంగా చేసుకుని ఆదాయం చేసుకుంటున్నారు. ఆ ఊరేంటో.. ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..!
సోషల్ మీడియా వినియోగం పెరిగాక... యూట్యూబ్ చానల్ పెట్టి, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జించే వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని టుల్సీ అనే గ్రామంలో అడుగుపెడితే... ఎక్కడ చూసినా వీడియో షూటింగులే కనిపిస్తాయి. అక్కడి జనాభాలో సగం మంది యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేవారే. మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో వేయి మంది యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది.
ఇవీ చదవండి: చీతాలకు ఏమవుతోంది... తాజాగా మరో చీతా బలి.. ఇప్పటివరకు చనిపోయినవి ఎన్నంటే...
టుల్సీ గ్రామంలో కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు అందరూ కంటెంట్ క్రియేటర్లుగా స్థిరపడ్డారు. వీరిలో ఎక్కువ మంది రైతులే. వ్యవసాయ పనులతో పాటు ఖాళీ సమయాల్లో వీడియోలు రూపొందిస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.వీరి చానళ్లకు లక్షల సంఖ్యలో సబ్ స్క్రయిబర్లు, ఫాలోవర్స్ ఉన్నారు. ఖాళీ సమయాల్లో వీడియోలు రూపొందిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ ఊరి వాళ్లను చూసి నెటిజన్లు ‘హ్యాట్సాఫ్’ చెబుతున్నారు.
ఇవీ చదవండి: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటో తెలుసా... ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే... ఒక్క గోవాలో మాత్రం
'' గ్రామంలో సుమారు 3,000 మంది జనాభా ఉన్నారు. అందులో 40 శాతం మంది యూట్యూబ్ కు కనెక్ట్ అయ్యారు. యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్లం. తర్వాత టిక్‌టాక్‌తో బాగా ఫేమస్ అయ్యాం. ఇప్పుడు రీల్స్ కూడా చేస్తున్నాం. నేను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశా. పార్ట్ టైమ్ టీచర్‌గా చేస్తున్నా. నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించేదాన్ని. ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు సంపాదిస్తున్నాం''. అని ఓ గ్రామస్తుడు చెబుతున్నాడు.
ఇవీ చదవండి: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
"నేను యూట్యూబ్ ప్రారంభించి ఏడాదిన్నర అయింది. మాకు 40 యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ఇక్కడి మహిళలు ఇళ్ల నుంచి బయటకు కూడా వచ్చేవారు కాదు. కానీ, మేము వీడియోలు చేయడం ప్రారంభించాక చాలామంది బాలికలు, మహిళలు కూడా సత్తా చాటుతున్నారు అని పింకీ సాహు అనే మరో యూట్యూబర్ చెప్పాడు.