Kuno National Park: చీతాలకు ఏమవుతోంది... తాజాగా మరో చీతా బలి.. ఇప్పటివరకు చనిపోయినవి ఎన్నంటే...
దీంతో గత నాలుగు నెలల్లో మరణించిన చీతాల సంఖ్య ఏడుకు పెరిగింది. నాలుగేళ్ల వయసు ఉన్న తేజస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు.
నాలుగు పెద్ద చీతాలు మరణించగా... నమీబియా నుంచి తీసుకువచ్చిన జ్వాల అనే చీతాకు జన్మించిన మూడు కూనలూ కూడా మరణించాయి. దీంతో మొత్తం ఏడు చీతాలు మరణించినట్లైంది.
☛☛ చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్దం.. దీని ప్రత్యేకతలు ఇవే...
2022 సెప్టెంబర్‌లో చీతాల పునర్‌ఆగమన కార్యక్రమాన్ని భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఒకటితర్వాత మరొకటి మరణిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెండు మగ చీతాలను సోమవారం అడవిలోకి వదిలేశారు. అయితే మరుసటి రోజే వాటిలో ఒక మగ చీతా మరణించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
☛☛ Heavy Rains: వణుకు పుట్టిస్తున్న వానలు... ఇప్పటికే 100 మందికిపైగా మృతి
కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. వీటిలో ఇప్పటివరకు మూడు ఆడ చీతాలు, ఒక మగ చీతా మరణించింది. అలాగే మూడు కూనలు చనిపోయాయి. దక్ష, సాశా, జ్వాల అనే ఆడ చీతాలు మరణించగా, తాజాగా తేజస్ అనే మగ చీతా మరణించింది. జ్వాల ఈ ఏడాది మార్చిలో నాలుగు కూనలకు జన్మనివ్వగా అందులో మూడు పిల్లలు చనిపోయాయి.