Gun Control: తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం

అమెరికా అత్యున్నత అధకారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈచట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సెప్టెంబర్ 27వ తేదీ సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం లైసెన్స్‌లేని తుపాకులు, సీరియల్ నంబర్‌లేని తుపాకులు, 3డీ పద్ధతిలో ముద్రించిన తుపాకుల కట్టడి, నిషేధంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు.
సాధారణ గన్, పిస్టల్‌ను ఆటోమేటిక్ మెషీన్ గన్‌గా మార్చే యంత్రాలను నిషేధించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడనుంది. మరికొద్ది వారాల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేశారు.
3డీ ప్రింటెడ్ గన్‌లను స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు కూడా గుర్తించలేకపోతున్నాయని బైడెన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన బాధ్యతలను 2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించారు.
Israel Hezbollah Conflict: నాలుగు దశాబ్దాల.. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా రక్తచరిత్ర ఇదే..