Heavy Rains: వణుకు పుట్టిస్తున్న వానలు... ఇప్పటికే 100 మందికిపైగా మృతి
Sakshi Education
ఉత్తర భారతాన్ని వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలదెబ్బకు ఉత్తరాది రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటో తెలుసా... ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే... ఒక్క గోవాలో మాత్రం
హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌లో 9 మంది చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఆస్తినష్టమే రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, హరియాణల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఇక యుమునా నది ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి 207.18 మీటర్లకు చేరింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం. ఇక ఢిల్లీలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Published date : 12 Jul 2023 12:41PM