PM College of Excellence: 'పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ప్రారంభించిన అమిత్ షా
ఇండోర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్‌లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడంలో నరేంద్ర మోడీ దూరదృష్టిని ప్రశంసించారు. దీనిని ప్రారంభించడం కేవలం ఈ కళాశాలల పేరు మార్చడం మాత్రమే కాదని అన్నారు.
ప్రధాన్ మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు పొందేందుకు అర్హత సాధించేందుకు నిర్ణయించిన పారామీటర్‌లు, ప్రమాణాలకు అనుగుణంగా కళాశాలలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.486 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ కళాశాలల్లో కంపార్ట్‌మెంటల్ విద్య ఉండదని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ) డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.
Sampoornata Abhiyan: ‘సంపూర్ణత అభియాన్’ను ప్రారంభించిన నీతి ఆయోగ్