Inspiration Story : అతి సామాన్య కలెక్టర్.. ఒక్క సంవత్సరంలోనే..
అవును సరిగ్గా భోజనం టైంకి స్కూల్ కు వెళ్లే ఆ కలెక్టర్ అక్కడ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తాడు. బిజీ షెడ్యూల్ తప్పితే మిగతా ఎక్కువ రోజులు ఇలాగే చేస్తాడు.. వివరాల్లోకి వెళితే..
పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే..
కేరళ రాష్ట్రం అల్లపుజా జిల్లా. కలెక్టర్ ఎస్.సుహాన్. 2012 IAS బ్యాచ్ కు చెందిన ఈయన అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరాగానే జిల్లాలోని పాఠశాల్లో బోధన, సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఒకసారి మధ్యాహ్నం నీరుకున్నమ్ లోని శ్రీదేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు వెళ్లారు. సరిగ్గా పిల్లలు భోజనం చేసే సమయంలో. కలెక్టర్ వచ్చారని అందరూ హడావిడి చేస్తుంటే.. ఆయన నేరుగా డైనింగ్ హాలులోకి వెళ్లారు. ఓ ప్లేట్ తీసుకున్నారు. పిల్లల మధ్య కూర్చుని భోజనం చేశారు. ఆ రోజు కర్రీస్ దోసకాయ, ఆలుగడ్డ. పెరుగు కూడా ఉంది. పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగోలేదని పిల్లలు చెబితే.. వెంటనే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటాడు. అది ఆయన లంచ్ టైమ్ లో చేసే పని. ఆయన నార్మల్ వర్క్ తో పాటు ఇలా లంచ్ టైమ్ లో వివిధ పాఠశాలలను సందర్శించడం… పిల్లలతో కలిసి భోంచేయడం… అది ఇప్పుడే కాదు.. ఆయన ఇదివరకు వయనాడ్ జిల్లా కలెక్టర్ గా చేసినప్పుడు కూడా అలాగే చేసేవాడు.
జస్ట్ ఒక్క సంవత్సరంలోనే..
ఇది ఒక్క రోజు జరిగిన డ్రైవ్ కాదు.. అంతకు ముందు ఆయన వయనాడ్ జిల్లా కలెక్టర్ గా కూడా పని చేశారు. అప్పుడు కూడా ఇలాగే గిరిజన పాఠశాలలపై దృష్టి పెట్టారు. ప్రతి రోజు ఓ గిరిజన పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చేవారు. దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజన స్కూల్స్ విద్యార్థుల సంఖ్య అనూహస్యంగా పెరిగింది. ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్ చేరారు. జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఈ మార్పు తీసుకొచ్చారు అక్కడ.
అతి సామాన్యుడిలా..
అక్కడి నుంచి ఇటీవలే అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు కలెక్టర్ సుహాన్. దీని వల్ల మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరుగుతుందని.. విద్యార్థుల ఆరోగ్యంపైనే కాకుండా చదువుపై కూడా దృష్టి పెట్టటానికి వీలవుతుంది అన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పుడుతుందన్నారు. అతి సామాన్యుడిగా.. ఓ పేరంట్ గా వారితో కూర్చుని భోజనం చేయటం వల్ల పిల్లల్లోనూ భరోసా, ధీమా, దైర్యం వస్తుందన్నారు.
స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి..
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి. మెనూ తప్పినా.. నాణ్యత లేకపోయినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏ స్కూల్ కు వచ్చి భోజనం చేస్తారో అనే భయం.దీంతో ఆయన ఏ జిల్లాలో కలెక్టర్ గా ఉంటే ఆ జిల్లా ప్రభుత్వ స్కూళ్ల అధికారులు వణికిపోవాల్సిందే. ఎప్పుడు ఏ స్కూల్ కు వెళ్తాడో తెలియదు కదా. ఏ స్కూల్ లో మధ్యాహ్న భోజనం చేస్తాడో తెలియదు. దీంతో ఆటోమెటిక్ గా స్కూళ్లలో విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు పెంచడం చేశారు అధికారులు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందట.
Inspiring Story : విపత్కర పరిస్థితిల్లో..ఆపద్బాంధవుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..