Skip to main content

Sedhu Madhavan IAS Success Story : కోచింగ్‌కు ఆర్థిక స్థోమత లేదు.. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నా'ఐఏఎస్' కావాల‌ని.. కానీ..

సివిల్స్‌ కోచింగ్‌ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత లేదు. కానీ సాధించాల‌నే ల‌క్ష్యం మాత్రం బలంగా ఉంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అతను అదే స్ఫూర్తితో ఇష్టంగా చదివాడు.
Sedhu Madhavan IAS     Sethu Madhavan success story in civil services

కోచింగ్‌ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత లేక కేంద్ర ప్రభుత్వం ఏటా 50 మందికి ఉచితంగా సివిల్స్‌కి శిక్షణ ఇస్తుందని తెలుసుకుని అందులో ఎంపికై ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్‌ కూడా తీసుకున్నాడు. చివరికి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే.. సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి.. ఐఏఎస్‌కు సెలెక్ట్‌ అయ్యాడు. ఆయనే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చిన సేతు మాధవన్‌. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్‌ సేతు మాధవన్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
మాది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కంది కుప్పం గ్రామం. మాది మధ్య తరగతి కుటుంబం. అమ్మ గృహిణి. నాన్న నా 17వ ఏట మృతిచెందారు. అక్క, చెల్లి ఉన్నారు.

☛ UPSC Civils Ranker Success Story : వ‌రుస‌గా మూడు సార్లు ఫెయిల్‌.. చివ‌రికి ఈ మాట‌ల వ‌ల్లే సివిల్స్ కొట్టానిలా..

ఎడ్యుకేష‌న్ : 
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నా విద్యాభ్యాసం కృష్ణగిరి జిల్లాలోనే జ‌రిగింది. కోయంబత్తూర్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. నా చిన్నప్పుడు పాఠశాలలో క్లాస్‌ టీచర్‌ నువ్వేమవుతావ్‌ అని అడిగితే భయపడకుండా నేను ఐఏఎస్‌ అవుతానని చెప్పాను.

☛ Sirisha, SI : న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

అప్పుడే బలంగా నిర్ణయించుకున్నా.. ఐఏఎస్ కావాల‌ని..

Sedhu Madhavan S IAS Success Story

ఇంటర్మీడియట్‌ తరువాత డ్రైవింగ్‌ లైసెన్సు కోసం, అలాగే ఒకానొక సందర్భంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం నెల రోజులపాటు కార్యాలయాల చుట్టూ తిరిగాను. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. వెంటనే దినపత్రికల్లో వచ్చిన సివిల్స్‌ నోటిఫికేషన్‌ చూసి అడుగు ముందుకువేశా. ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ పొంది ఐఏఎస్‌ సాధించా.

 Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..

ఆ పుస్తకాలు నాలో..
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, మహాత్మాగాంధీల ఆటోబయోగ్రఫీ చదివాను. ఆ పుస్తకాలు నాలో మరింత స్ఫూర్తి నింపాయి. నా ఐఏఎస్‌ కల సాకారం చేసుకున్నాను. 2021లో అకాడమీలో పరిచయమైన శోభికతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె పార్వతీపురం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

నా అదృష్టంగా..

Sedhu Madhavan S IAS Officer Rea Life Story In Telugu

తొలుత ప్రకాశం జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా చేశా. మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ఎంఎస్‌ఎంఐ శాఖలో సీఈఓగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు జేసీగా బాధ్యతలు చేపట్టాను. నేను ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై, పౌర సరఫరాల సంస్థ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

Published date : 12 Mar 2024 10:17AM

Photo Stories