Mechanical to IAS: సాఫ్ట్‌వేర్ కొలువును తిరస్కరించి.. ఐఏఎస్ లక్ష్యంగా వచ్చి.. మరి ఫలితం ఎలా ఉందంటే..
వినూత్న తండ్రి ప్రస్తుతం నాగులుప్పలపాడు మండలం చదలవాడ పశుక్షేత్రం డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సుభాషిణి సేంద్రియ వ్యవసాయం జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
➤ IAS Achiever Story : నా చిన్నప్పట్టి కలను సాకారం చేసుకొని.. 'ఐఏఎస్' వరకు చేరానిలా.. కానీ..
వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె వినూత్న. ప్రాథమిక విద్యాభ్యాసం ఒంగోలులోని కృష్ణా మెమోరియల్ స్కూల్‌లో, ఉన్నత పాఠశాల విద్య స్థానిక శివాని స్కూలులో అభ్యసించింది. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, బీటెక్ బెంగళూరు అమృత కాలేజీలో చేసింది. బీటెక్‌లో ఆమె మెకానికల్ బ్రాంచ్ తీసుకుంది. ఆ బ్యాచ్ మొత్తంలో అందరు అబ్బాయిలు కాగా వినూత్న ఒక్కరే విద్యార్థిని. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మెకానిక్‌లో చేరింది.
➤ Success of Childhood Dream as IAS : నా తండ్రి చెప్పిన ఆ మాటలే.. నన్ను 'ఐఏఎస్' కొట్టేలా చేశాయ్..
అనంతరం కోల్‌కతాలో కాగ్నిజెంట్ కంపెనీలో రూ.45 వేలు నెలకు జీతంతో ఉద్యోగం లభించింది. అయితే ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ ఎలా ఉంటుందో ప్రయత్నించింది. అంతే, అక్కడకు చేరిన తరువాత లక్ష్యం ఐఏఎస్‌గా మార్చుకుంది. ఆమె ఎంచుకున్న లక్ష్యానికి తల్లిదండ్రులు కూడా సరే అన్నారు. అక్కడ లక్ష్యయ్య ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో 2017లో చేరింది.
➤ IAS Achievement : ఎటువంటి శిక్షణ లేకుండానే.. రెండో ప్రయత్నంలోనే ఐఏఎస్ కొట్టానిలా..
తొలి ప్రయత్నం ప్రిలిమినరీకి కూడా సక్సెస్ కాలేదు, రెండో యత్నంలో ప్రిలిమనరీ సాధించింది. కానీ మెయిన్స్‌లో రాణించలేదు. మూడో యత్నంలో ప్రిలిమినరీతోపాటు మెయిన్స్‌లోనూ సక్సెస్ అయింది. కానీ ఇంటర్వ్యూలో రాణించలేకపోయింది. నాలుగో యత్నం నిరాశపరిచింది.
➤ Inspirational Ranker in Civils: ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు..
అయితే పట్టుదల ఉంటే దేనినైనా సాధించగలమంటూ ఐదోసారి కుటుంబ సభ్యులకు అద్భుతమైన న్యూస్ అందించింది. జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో ఎస్సీ మహిళ కోటాలో 462వ ర్యాంకు సాధించింది. దీంతో అటు వినూత్న, ఇటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.
➤ Constable to SI Posts: మొన్నటివరకు కానిస్టేబుల్లు.. ఇప్పుడు ఎస్ఐగా విధులు
గత ఏడాది 508వ ర్యాంకుకే ఐఏఎస్ రావడం, ఈ ఏడాది సీట్లు ఎక్కువగా ఉండడం, ర్యాంకు 462 కావడంతో తప్పకుండా ఐఏఎస్ వస్తుందని అందులో మరో ఆలోచనే అవసరం లేదంటూ కోచింగ్ సెంటర్ యజమాని లక్ష్యయ్య స్పష్టం చేయడంతో తాను ఎంచుకున్న రంగాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని, ఇది మాటల్లో చెప్పలేని భావన అంటూ వినూత్న తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఐఏఎస్ రాసే క్రమంలో గ్రూప్-1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికైందని, అయితే ఇంటర్వ్యూకు అటెండ్ కానని తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. వినూత్న సోదరి ప్రస్తుతం వైజాగ్‌లో ఎంఎస్ సర్జన్ చేస్తోంది.
➤ Civil SI Achievement: ఎస్ఐగా కొలువు కొట్టిన సెక్యూరిటీ కూతురు..
అనుకున్నది సాధించి..
సివిల్స్‌లో ఒంగోలు అమ్మాయి జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి సత్తా చాటింది. పట్టు విడవకుండా అనుకున్నది సాధించింది బొల్లిపల్లి వినూత్న. జాతీయ స్థాయిలో 462వ ర్యాంకు సాధించింది. ఐఏఎస్ కావాలన్న మక్కువతో సాఫ్ట్‌వేర్ కొలువు సైతం కాదనుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.