Inspiring Story: కలెక్టర్.. డాక్టర్.. యాక్టర్.. డ్యాన్సర్.. ఎడిటర్.. రైటర్.. సింగర్.. ఈమె స్టోరీ చదివితే ఫిదా అవ్వాల్సిందే..
భూతల స్వర్గంగా పేరున్న కేరళ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 10 జిల్లాల కలెక్టర్లు మహిళలే కావడం గమనార్హం. రాజకీయాలు, రక్షణ, అనేక ఇతర కీలకరంగాలలో పురుషులతో పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ఈ దేశంలో ఇది అరుదైన ఘనతగా అంతా పేర్కొంటున్నారు. ఈ లేడీ సింహాల విజయ రహస్యాలు మీకోసం..
కేరళలో పరిపాలనా సేవల్లో..
ప్రజాసేవ చేయడానికి పరిపాలనలో భాగంగా ఉన్నతాధికారులలో మెజారిటీ సంఖ్య ఇప్పటివరకు పురుషులదే. కానీ, కేరళలో మాత్రం ఆ సంఖ్య మహిళలదయ్యింది. డాక్టర్ రేణు రాజ్ అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంతో కేరళలో ఇప్పుడీ మహిళా కలెక్టర్ల సంఖ్య పదికి చేరింది.
రాష్ట్ర పరిపాలనలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు కేరళలో పరిపాలనా సేవల్లో మహిళా కలెక్టర్లు 71.4 శాతం ఉన్నారు.
ఈ లేడీ సింహాలు ఇప్పుడు..
కేరళలోని ఇతర జిల్లా మహిళా కలెక్టర్లలో హరిత.వి.కుమార్ (త్రిసూర్), దివ్య ఎస్ అయ్యర్ (పథనం తిట్ట), అఫ్సానా పర్వీన్ (కొల్లం), షీబా జార్జ్ (ఇడుక్కి), డాక్టర్ పికె జయశ్రీ (కొట్టాయం), భండారి స్వాగత్ రణవీర్ చంద్ (కాసర్ గోడ్), నవజోత్ ఖోసా (తిరువనంతపురం), మృణ్మయీ జోషి (పాలక్కాడ్), డాక్టర్ ఎ.గీత (వాయనాడ్)లు ఉన్నారు. వీరిలో రేణురాజ్, దివ్య.ఎస్.అయ్యర్, హరిత వి.కుమార్, పి.కె.జయశ్రీ, షీబా జార్జ్, గీత కేరళ వాసులే.
Amrapali, IAS : ఆమ్రపాలి సక్సెస్ జర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేపథ్యం ఇదే..?
మొదటి ప్రయత్నంలోనే 2వ ర్యాంక్..
35 ఏళ్ల డాక్టర్ రేణురాజ్ మార్చి 2న అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిరీత్యా రేణు వైద్యురాలు. 2015లో యుపిఎస్‌సి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెండవ ర్యాంక్ సాధించారు. జిల్లా కలెక్టర్‌గా ఆమెకు ఇదే తొలి పోస్టింగ్.
ఈ కలెక్టర్ హూషారు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.
గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్‌గా విధులను చేపట్టిన ఈ కలెక్టరమ్మల్లో వివధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారున్నారు. వారిలో పథానంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ ఒకరు. డాక్టర్, ఎడిటర్, రైటర్, యాక్టర్, డ్యాన్సర్, సింగర్‌గా కూడా దివ్య పేరొందారు. మలయాళీ వెండితెర మీద క్రిస్మస్ ప్రధాన అంశం గల సినిమాలోనూ నటించారు.
D.Roopa, IPS: ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐపీఎస్..ఎక్కడైన సరే తగ్గదేలే..
ఐఏఎస్ అధికారి అంటే హోదా, దర్పం మాములే.. ఇక జిల్లా కలెక్టర్ అంటే తీరిక ఉండదు. ప్రభుత్వ ప్రాధామ్యాలు నెరవేర్చడంలో వారు బిజీ. అవును ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా అదే సిచుయేషన్.. పని ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు వారు మానసిక ప్రశాంతత కోసం పాటలు పాడటం, డ్యాన్సు వేయడం మంచిదే. కానీ తీరిక ఉండదు. మరీ స్కూల్, కాలేజీ సెలబ్రేషన్స్‌కు వెళ్లిన సమయంలో అవకాశం ఉంటుంది. దానిని కేరళ కలెక్టర్ యూజ్ చేసుకున్నారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు. దానిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో ఇటీవల తెగ వైరల్ అవుతుంది.
కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్.. డ్యాన్సర్ కూడా.. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఆ కళను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లా స్టేడియంలో మహ్మాత్మాగాంధీ యూనివర్సిటీ యూనియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ జరిగాయి. అక్కడ విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాథొలికేట్ కాలేజ్ స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తున్నారు. అదీ ఆమెకు తెగ నచ్చేసింది. ఇంకేముంది వారితో చేరారు. విద్యార్థులతో కలిసి సమానంగా చిందులేశారు.
Ira Singhal, IAS : నా పరిస్థితులే..నన్ను 'ఐఏఎస్' చేసాయ్..
‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’..
గతంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌లో డాక్టర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాతి జాబితాలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ హరిత వి.కుమార్ చేరుతారు. 2012లో కేరళలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారీమె. ఎలక్ట్రానిక్స్ విభాగం లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన హరిత ‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’ అంటారు. మలయాలీ సినిమాలంటే ఇష్టపడే హరిత మోహినీయాట్టం, భరతనాట్యం, కర్ణాటక సంగతంలోనూ ప్రావీణ్యురాలు.
తల్లి లాగే న్యాయవాద చదువును చదివి..
పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ మృణ్మయి జోషి కలెక్టర్ అవడానికి ముందు ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. పుణేవాసి. ముంబయ్ హై కోర్టు మాజీ జడ్జి షాలినీ ఫన్సల్కర్ జోషి కూతురు. తల్లి లాగే న్యాయవాద చదువును పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలిసీలో మాస్టర్స్ చేశారు.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
ఇదే నా లక్ష్యమైంది.. ఎందుకంటే..?
తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నవ్‌జోత్ ఖోసా అమృతసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి బీడీఎస్ చేశారు. యూనివర్శిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ‘ఐఎఎస్ ముందు నా తండ్రి కల. అదే నా లక్ష్యం అయ్యింది’ అంటారీమె. రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నతాధికారులుగానే కాదు 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో మహిళలు 50 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించారు. పితృస్వామ్య సమాజంలో ఇది అంత తక్కువ విషయమేమీ కాదు. దేశ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కేరళ కేబినేట్‌ను వణికించిందిలా..
2017, కేరళలోని అలప్పుళ జిల్లా. మార్తండమ్ చెరువును పరిశీలిస్తున్నారు కలెక్టర్. ఓ కట్టడం కోసం ఆ చెరువు సగం లెవెల్ చేసి ఉంది. నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ చెరువును ఆనుకునే ఇంకోవైపు వరిపొలాలున్నాయి. వాటిలో సగం కూడా లెవెల్ చేసి ఉన్నాయి. ‘ఇక్కడేం కడ్తున్నారు?’ అడిగారు సబార్డినేట్స్‌ను. ‘పార్కింగ్ లాట్ మేమ్’ చెప్పారు. ‘ఊ’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చారు కలెక్టర్ వెనక్కి తిరుగుతూ. ఆమె కారులో కూర్చొని అక్కడి నుంచి కదిలాక చెప్పడం మొదలుపెట్టాడు సంబంధింత సబార్డినేట్. ‘మేమ్.. ఇందులో మంత్రిగారి హస్తముంది.
ప్రతిపక్షాల నుంచి చాలా కంప్లయింట్స్ వచ్చినా మేనేజ్ చేసుకున్నారు. పైగా నిరూపిస్తే మినిస్టర్‌గిరే కాదు ఎమ్మేల్యేగిరీకీ రాజీనామా చేస్తాను అని సవాల్ కూడా చేశారు’ చెప్పాడు. ఆ చెరువు కబ్జా ఫైల్‌లోనే తల పెట్టిన కలెక్టర్ పేజీ తిప్పుతూ ‘ఈ కట్టడం లేనప్పటి చెరువు ఫొటోలు ఏమైనా మనకు దొరకొచ్చా?’ అడిగారు.‘ప్రయత్నించొచ్చు మేమ్’ తెలిపాడు. ‘అయితే ప్రయత్నం మొదలుపెట్టండి’ ఫైల్ మూసేస్తూ చెప్పారు కలెక్టర్. ఆ ప్రయత్నం ఫలించింది. చెరువుకు చెందిన శాటిలైట్ ఫొటోలు వచ్చాయి. అంతుకుముందు చెరువు ఎలా ఉందో ప్రస్తుతం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది వాటి ద్వారా. వాటిని పెట్టి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించారు కలెక్టర్.
దీని మీద సంబంధిత వ్యక్తి కోర్టుకు కూడా వెళ్లాడు. అతని పిటీషన్‌ను కొట్టిపారేసింది కోర్టు. కేరళ ప్రభుత్వ ‘ప్యాడీ అండ్ వెట్‌ల్యాండ్ యాక్ట్’ కింద నేరం రుజవైంది. అతను చెప్పినట్టు రాజీనామా చేయలేదు. కాని ఆ జిల్లా కలెక్టర్ ధైర్యసాహసాలు, నిబద్ధత దేశమంతా మారుమోగాయి. ఆమె.. టీవీ అనుపమ. అతను.. కేరళ రవాణాశాఖ మంత్రి థామస్ చాందీ! అనుపమ ఈ యాక్షన్‌తో కేరళ కేబినేట్ వణికిపోయింది. ఆమెను అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా ఏరికోరి నియమించింది స్వయానా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌నే అయినా నియమ నిబంధనలను అతిక్రమిస్తే మంత్రిని కూడా ఉపేక్షించేది లేదని నిరూపించారు ఆమె.
టీవీ అనుపమ కుటుంబ నేసథ్యం :
కేరళలోని మలప్పురం జిల్లా ‘పొన్నని ’అనుపమ సొంతూరు. తండ్రి కేకే సుబ్రహ్మణ్యన్. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ 2002లో మరణించాడు. తల్లి టీవీ రమణి ఎండోమెంట్ శాఖ ఉద్యోగి. అనుపమే పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. నైన్త్‌క్లాస్‌లోనే నిర్ణయించుకుంది ఐఏఎస్ కావాలని. తండ్రి చనిపోయేనాటికి అనుపమ టెన్త్‌లో ఉంది.
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
అనుపమ పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా..
నాన్న పోయిన పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని పబ్లిక్ పరీక్షలు రాసింది. స్టేట్‌లో పదమూడవ ర్యాంక్ సంపాదించింది. ఇంటర్‌లో మూడో ర్యాంక్! బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌లో బీటెక్ చేసింది. ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే సివిల్స్‌కి ప్రిపేరవసాగింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే (2010) ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్‌తో సివిల్స్‌లో విజయం పొందింది.
ఈ యువ ఐఏఎస్ పనిచేసినా..
2015లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ. ఏ పనిచేసినా అందులోని లొసుగుల్ని సవరించందే నిద్రపోరు. వృత్తి అంటే అంత అంకితభావం. ఐఏఎస్‌గా నియామకం పొందిన క్షణాన్నే ప్రమాణం చేశారు కర్తవ్యనిర్వహణే ప్రాణం అని. ఆ నైజాన్నే ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌గా ఉన్నప్పుడూ చూపించారు. పేరున్న చాలా ఫుడ్ బ్రాండ్స్ కల్తీలు, మితిమీరిన శాతంలో క్రిమిసంహారక మందులను వాడి ఆహారపదార్థాలను మార్కెట్‌లో అమ్ముతున్నాయి.
ఈ విషయం ఆమె దృష్టికి వచ్చింది. శాంపిల్స్ తెప్పించారు. పరీక్షకు పంపించారు. నిజమని తేలింది. ప్రతి వస్తువు కల్తీనే. పరిమితికి మించి 300 శాతం పెస్టిసైడ్స్. హతాశురాలయ్యారు. వెంటనే గోడౌన్స్ మీద దాడులు చేశారు. కేస్ కోర్ట్‌దాకా వెళ్లింది. రుజువులుగా కూరగాయలు, పండ్ల శాంపిల్స్‌ను కోర్టు ముందుంచారు. పెద్ద పెద్ద బ్రాండ్ల మోసాలను కోర్టు ప్రత్యక్ష్యంగా తెలుసుకుంది. డీలర్ల అరెస్ట్‌కు ఆర్డర్ వేసింది. అనుపమ తీసుకున్న స్టెప్ ఇంతటితో ఆగలేదు. పౌరులకు ఒక విజ్ఞాపన చేశారు. ఎవరిళ్లల్లో (వాకిలి, డాబా, బాల్కనీ ఇలా) వాళ్లు, చేలల్లో, చెలకల్లో సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు పండించమనీ, విత్తనాలను తాము అందిస్తామని.
Smita Sabharwal, IAS : సక్సెస్ జర్నీ...ఈమె భర్త కూడా..
అప్పటిదాకా కల్తీ నిండిన కడుపులను ప్రక్షాళన చేయడానికి ఇది మంచి ఆఫర్ అని కేరళ రాష్ట్రప్రజలూ ఒకొక్కరే నెమ్మదిగా ఇళ్లల్లో ఎంత జాగా ఉంటే అంతలో కూరగాయల పంట వేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల స్పందన రాష్ట్రప్రభుత్వాన్నీ ఆలోచనలో పడేసింది. వాళ్లకు ఏదైనా సహాయం అందించాలనుకుంది. దాంతో ఉచితంగా డ్రిప్‌ఇరిగేషన్, బయోగ్యాస్ ప్లాంట్ సౌకర్యాలను కల్పించింది. సబ్సిడీలు అందించింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే అప్పటిదాకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి చేసుకుంటున్న కూరగాయల దిగుమతులను గణనీయంగా తగ్గించుకునేంతగా. దటీజ్ అనుపమ ఐఏఎస్!
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
ఇది నాకిష్టం ఉండదు..
‘ఇదంతా నా ఘనతగా మీడియా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాలు, ఆర్భాటాలు నాకిష్టం ఉండదు. పైగా ఇందులో నేను చేసిందీ ఏమీ లేదు. కల్తీ జరుగుతోందని, పెస్టిసైడ్స్ వాడకం ప్రాణాంతకంగా మారిందని ప్రజలకు తెలిసింది. సొంతంగా సేంద్రీయ వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వ పరంగా నేను ఈ సహాయం చేయగలనని చెప్పాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వమూ ముందుకు వచ్చింది. కొనసాగుతోంది. అంతే’ అంటూ సింపుల్‌గా సెలవిస్తారు ఆమె.
వ్యక్తిగత జీవితంలోనూ..
సంచలనం కోసం కాదు సత్యం కోసం పోరాడాలి అనేది అనుపమ తత్వం. అన్యాయాన్ని మనం సహించకపోతే న్యాయం తానంతట తానే బతుకుంది అనేది ఆమె నమ్మిన నిజం. అందుకే వ్యక్తిగత జీవితంలోనూ పాటిస్తారు నిక్కచ్చిగా. 2014లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ. కుటుంబంతో కలిసి ఇంకో ఇంట్లోకి మారాల్సి వచ్చింది ఆమె. ఇచ్చిన గడువులో సామాన్లను తీసుకోలేకపోయారు అనుపమ.
దాంతో కేవలం ఆమెను వేధించే ఉద్దేశంతోనే ‘నొక్కుకూలీ’ (సామాన్లను కాపాలా కాసినందుకు, ప్రైవేట్ లేబర్‌తో ఆ సామాన్లను లోడ్ లేదా అన్‌లోడ్ చేయించినందుకు యూనియ్‌హెడ్‌లోడ్ వర్కర్స్‌కు అదనంగా చెల్లించే డబ్బు)ఇవ్వాలని సీఐటీయూ కన్వీనర్ బి.మురళి డిమాండ్ చేశారు.ఇది అన్యాయమని వాదించారు అనుపమ. వాషింగ్‌మెషీన్‌ను అలాగే ఉంచేసుకొని అదనపు కూలీ ఇస్తేనే దాన్ని ఇస్తామని చెప్పి వాళ్లింటి ముందున్న గోడమీద తన ఫోన్ నంబర్ రాసి డబ్బులు ఎప్పుడిస్తారో ఆ నంబర్‌కి కాల్ చేయమని చెప్పి మరీ వెళ్లాడు మురళి.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
అక్కడితో ఆగకుండా ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. పోలీస్‌కంప్లయింట్ ఇచ్చి మురళిని అరెస్ట్ చేయించారు అనుపమ. పక్షం రోజులు రిమాండ్‌లో ఉన్నాడు మురళి. తనను నియమించిన చీఫ్‌మినిస్టర్‌కైనా .. మురళి లాంటి వాళ్లకైనా.. తానెవరికీ భయపడననీ నిరూపించారామె. దటీజ్ అనుపమ. అందుకే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ఓ సంచలనం అయింది. నచ్చకపోయినా ఆమె పని తీరు ప్రాచుర్యం పొందుతోంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది పబ్లిసిటీ మంచిదే... ఇతరులకు ఇన్‌స్పైరింగ్‌గా!
కలెక్టర్ అనే దర్పం లేకుండా..
కేరళలో ఎన్నికల ఏర్పాట్లతో తలమునకలై.. కింది సిబ్బందితో ఉరుకులు పరుగులు పెట్టించే సమయం అది. ఈమె మాత్రం అలాకాదు.. తోటి సిబ్బందితో కలిసి పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ అనే దర్పం లేకుండా ట్రంకు పెట్టెలు మోసం శభాష్ అనిపించుకుంటున్నారు.
ఎన్నికల సామగ్రి ఉన్న బరువైన ట్రంకు పెట్టెలను లారీ నుంచి దించి కార్యాలయంలోకి మోసుకెళ్లారు. మిగిలిన సిబ్బందితో పాటుగా ఆమె కూడా పనిలో ఓ చేయి వేశారు.