UPSC Civils Free Coaching: 'సివిల్స్' ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
ఆదిలాబాద్‌రూరల్: సివిల్ సర్వీసెస్ లాంగ్‌టర్మ్–2025 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజాలింగు, స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి జూలై 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Goodnews For Infosys Employees: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
శిక్షణ తరగతులు జూలై 18 నుంచి ప్రారంభమై 2025 ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. మొత్తం 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుండగా, అందులో 100 మందిని 2024 జూలై 7న నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 50 మంది అభ్యర్థులను ఇంతకుముందు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని తీసుకోనున్నట్లు తెలిపారు.
వారు సంబంధిత పత్రాలతో జూలై 3లోగా నేరుగా టీజీబీసీ స్టడీ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ 500059 చిరునామాలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు వసతి, భోజన, రవాణా కోసం నెలకు రూ.5వేలు, మరో రూ.5వేలు బుక్ ఫండ్ నిమిత్తం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రంథాలయ సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు 08732–221280 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Mega Job Mela 2024: మెగా ఫార్మా జాబ్‌మేళా.. నెలకు రూ. 12-18వేల వరకు జీతం
Tags
- Free Civils Coaching
- Free UPSC Civils Coaching
- Free Civils Prelims Coaching
- prelims coaching
- civils long term coaching
- Civils
- Civils Mains
- upsc civils coaching
- Adilabad Rural Civil Services
- Long Term-2025 Exam
- Free Training Announcement
- BC SC ST EBC Candidates
- Online Application Dates
- Praveen Kumar Study Circle Director
- free trainings
- SakshiEducationUpdates
- Adilabad news