Free Coaching: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సూర్యాపేట టౌన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు జూలై 5న తెలిపారు.
టీఎస్ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూలై 21న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించరాదని పేర్కొన్నారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ఈ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు ఉచిత వసతి భోజనంతో పాటు 10 నెలలు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
Published date : 06 Jul 2024 03:51PM
Tags
- Civil Services Free Training
- UPSC
- SC Study Circle
- TS Study Circle
- Telangana News
- Suryapet Town news
- SC Study Circle updates
- Ramulu announcements
- UPSC training program
- Free education opportunities
- Minority Candidates
- Government exam preparation
- Civil Service exam coaching
- free trainings news
- FreeCoaching
- sakshieducationlatest news