Skip to main content

Civils Ranker: ఐపీఎస్‌ కల నెరవేర్చుకునేందుకు..

Chilumula Rajinikanth
Chilumula Rajinikanth

సివిల్స్‌ 364 ర్యాంకు సాధించిన చిలుముల రజనీకాంత్‌ స్వస్థలం నిర్మల్‌ జిల్లా మలక్‌చించోలి. ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి సుదర్శన్, తల్లి అరుణ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. చిన్నప్పుడు ఆదిలాబాద్‌లో చదువుకున్న రజనీకాంత్‌.. మద్రాస్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసి మానేశారు. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఇంతకుముందే సివిల్స్‌లో 598 ర్యాంకు సాధించి కేంద్ర పోస్టల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌ కావాలన్న కల నెరవేర్చుకునేందుకు మళ్లీ సివిల్స్‌ రాసి 364 ర్యాంకు సాధించారు.  

Published date : 25 Sep 2021 04:39PM

Photo Stories