Skip to main content

Software to IAS: ఆరో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపిక.. ఇవే విషయాలు లక్ష్యంగా!

సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. వారికి తన వంతు సేవలను అందించాలనుకున్నాడు. ఐఏఎస్‌ మార్గంగా కనిపించి, దానినే లక్ష్యంగా మార్చుకున్నాడు.
Shiva Narayana Sharma turns young IAS from a software engineer    IAS goal for societal service

అతనిది మధ్య తరగతి కుటుంబం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురకు చెందిన మురళీరాల్‌, మున్నిదేవి దంపతుల కుమారుడు శివనారాయణ శర్మ. తండ్రి మురళీరాల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి గృహిణి. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా గమనించారు. సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. వారికి తన వంతు సేవలను అందించాలనుకున్నాడు.

SI Posting: ఎస్ఐగా మొదటి పోస్టింగ్‌.. ఎక్కడా?

దీనికి ఐఏఎస్‌ మార్గంగా కనిపించి, దానినే లక్ష్యంగా మార్చుకున్నాడు. ఈ పయనంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగారు. పలుమార్లు విఫలమైనా వెనకడుగు వేయలేదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా సివిల్స్‌పై ఆశ వదులుకోలేదు. అలా పలుమార్లు పోరాడి ఆరో ప్రయత్నంలో ఐఏఎస్‌గా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం, ఆదోని సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Inspirational Story of IAS: స్పూర్తిగా నిలిచిన ఐఏఎస్‌ అంజు శర్మ.. టెన్త్‌, ఇంటర్‌లో ఫెయిల్‌ అయినా..!

శివనారాయణ శర్మ దిల్లీలోని దిల్లీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. ఆ తర్వాత దిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా 2013లో ఉద్యోగం సాధించారు. 2018 వరకు విధులు నిర్వహించారు. ఆ రంగం ఏమాత్రం నచ్చలేదు. తన చిరకాల స్వప్నమైన ఐఏఎస్‌ అధికారి కావాలని నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.

NEET Achiever: 20 ఏళ్ళ వయసులోనే నీట్‌ క్లియర్‌.. ఇది జరిగింది

బాధితులు నేరుగా కలవొచ్చు..

'ఐఏఎస్‌ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేయొచ్చు. ఆ లక్ష్యంతో కష్టపడి చదివి సివిల్స్‌ పాసయ్యా. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా. బాధితులు ఎవరైనా నేరుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పిస్తాం' అని యువ ఐఏఎస్‌ అధికారి శివనారాయణ శర్మ తెలిపారు.

ఐపీఎస్‌గా ఎంపికై..

ఐఏఎస్‌ లక్ష్యంగా శివనారాయణశర్మ సన్నద్ధమవడం ప్రారంభించారు. ఆయనకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించారు. మొదట మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నాలుగోసారి ఉత్తీర్ణత సాధించినా ఐఏఎస్‌ రాకపోవడంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఆదాయపు పన్ను శాఖలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా చేరారు. ఐదోసారి సివిల్స్‌ రాయగా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

ఒకపక్క ఐపీఎస్‌కు శిక్షణ తీసుకుంటూనే ఆరోసారి (2021)లో హాజరై ఐఏఎస్‌లో ఉత్తీర్ణత సాధించారు. ముస్సోరిలో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత గుంటూరులో శిక్షణ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆదోని సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన కల నెరవేర్చుకున్నారు. లక్ష్యం నిర్దేశించుకోవడం.. దానిని సాధించాలనే తపన, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించారు శివనారాయణ శర్మ.

Published date : 25 Dec 2023 02:48PM

Photo Stories