Inspirational Story of IAS: స్పూర్తిగా నిలిచిన ఐఏఎస్ అంజు శర్మ.. టెన్త్, ఇంటర్‌లో ఫెయిల్ అయినా..!
పదో తరగతితో పాటు 12వ తరగతి కూడా ఫెయిల్ అయ్యారు రాజస్థాన్‌కు చెందిన అంజు శర్మ. అటువంటిది, ఆమె ప్రస్తుతం రాజధాని గాంధీనగర్‌లో ఉన్న రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ (ఉన్నత మరియు సాంకేతిక విద్య)లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఈ కింది కథలో తెలుసుకుందాం..
తను చదువులో తెలివైన విద్యార్థి అయినప్పటికీ, తన అల్లరితనంలో మెరిసేది కాదు. అయితే, దీని మూలంగానే తను టెన్త్ ఫెయిల్ అయ్యింది. ఇంటర్‌లో ఎకనామిక్స్‌లో మాత్రమే ఫెయిల్ కాగా మిగిలిన వాటిల్లో డిస్టింక్షన్‌లో పాస్ అయ‍్యింది. అంజు శర్మ ఎలా ఉన్నా కూడా తన తల్లి ఎప్పుడూ తనకు తోడుగానే ఉండేది. తన చదువు విషయంలో కూడా తనకు తోడుగా నిలిచి నడిపించింది. తనకు చదువులో ఎందుకు వెనకబడిందో తెలియజేసింది. అనంతరం, తన స్టడీ స్ట్రాటజీని మార్చుకోవాలనుకుంది. అలా, తన 12వ తరగతి పూర్తి అవ్వగానే, తన డిగ్రీ మాత్రం సరైన దారిలో వెళ్ళాలని నిర్ణయించుకుంది.
NEET Achiever: 20 ఏళ్ళ వయసులోనే నీట్ క్లియర్.. ఇది జరిగింది
యూనివర్సిటీలో బీఎస్‌సీ చేసి, ఎంబీఏ చేసింది. తన గ్రాడ్యేయేషన్‌లో తను గోల్డ్ మెడల్ స్టూడెంట్ అయ్యింది. తన చదువు పూర్తయిన అనంతరం, ఆమె యూపీఎస్‌సీకి సిద్ధమవ్వాలనుకుంది. ఇందుకు ఆమె తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఈ ప్రయత్నంలోనే తొలిసారిగా తను సివిల్ సర్వీసెస్ పరీక్షను రాసారు. మొదటి ప్రయత్నంలోనే తనకు విజయం దక్కింది. అనుకున్న దారిలోనే నడిచింది. అనుకున్న గమ్యాన్ని చేరుకుంది అని అందరూ తనని అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆమె వయస్సు 22 ఉన్నప్పుడే తను గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహించారు. రాజ్‌కోట్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా పరిపాలనా సేవలో తన వృత‍్తిని ప్రారంభించింది. ప్రస్తుతం, రాజధాని గాంధీనగర్‌లో ఉన్న రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ (ఉన్నత మరియు సాంకేతిక విద్య)లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
తన పాఠశాల చదువులో ఫెయిల్ అయ్యింది. ఇంటర్‌లో ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యింది. అటువంటిది, ఇప్పుడు ఐఏఎస్ ర్యాంకర్‌గా నిలిచింది అంటే.. తన ఎంతో మందికి ఉదాహరణగా నిలిచిందో చెప్పోచ్చు. తన ఈ ప్రయాణం తనకు మాత్రమే కాదు, చదువులో మనం ఏం చేయలేం, మనం ఏమీ చేయలేం అని అనుకున్నవారందరికీ ఇది గొప్ప స్పూర్తి.