Success as Civils Ranker: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగానూ.. సివిల్స్ ర్యాంకర్‌గానూ..! ఇలా సాధించుకున్నాడు
సాధించాలన్న తపన ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చు. కొందరు తాము ఎంచుకున్న లక్ష్యానికే పరిమితమై ఎన్ని ఎదురుకున్నా సరే దానికే కట్టుబడి ఉంటారు. మరికొందరు చదువుతున్న విద్యతోపాటు సమాజాన‍్ని కూడా చదువుతూ.. మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో కల్ల వారే ఈ యువకుడు. బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి.. తన స్వగ్రామం ఓడి చెరువు మండలం బోయపల్లి కాగా, వీరి కుటుంబం ప్రస్తుతం కదిరిలో స్థిర పడింది. తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు, తండ్రి రాజశేఖరరెడ్డి విశ్రాంత జువాలజీ లెక్చరర్. హైదరాబాద్‌లో ఐఐటీలో బీటెక్ చదువును పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సాధించాడు. కాని, తనులో ప్రజలకు ఏదో మంచి చేయ్యాలన్న లక్ష్యం ఏర్పడింది. అందుకు తను సివిల్స్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అలా, ఉద్యోగంతో పాటు సివిల్స్‌కు కూడా సన్నద్దమై ముందుకుసాగాడు.
ఉద్యోగం చేస్తూనే...
ఏదో సాధించాలన్న పట్టుదలతో సివిల్స్‌లో చేరాడు. ఇందుకు తన తల్లిదండ్రులు కూడా పూర్తిగా సహకరించారు. ఈ తపతో ఢిల్లీకి వెళ్లి వాజీరాలో శిక్షణ తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోసం సిద్ధం అవ్వడం చిన్న విషయం కాదు. ఇలా, ప్రయత్నించి తన కష్టానికి ఫలితాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా జాతీయ స్థాయిలో 270 ర్యాంకుతో మెరిసాడు అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఢిల్లీలోని 'వాజీరా'లో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. తమ కుమారుడికి సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు.
Tags
- civils ranker
- Success
- software employee
- Success as Civils Ranker
- Success Stories
- inspirational stories
- civils ranker success story
- success stories in telugu
- inspiring youth
- CivilServicesPreparation
- Inspiration For Youth
- youth inspiration
- YouthSuccess
- MotivationalJourney
- sakshi education successstories