BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కోచింగ్
Sakshi Education
సివిల్స్ సాధించాలని కలలు కంటున్న యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 10నుంచి నుంచి వెబ్‌సైట్ http://tsbcstudycircle.cgg.gov.inలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 –24071178లో సంప్రదించాలని చెప్పారు.
చదవండి:
PGCET: పీజీసెట్ మొదటి ర్యాంకర్లు వీరే..
Published date : 10 Nov 2021 03:33PM