Skip to main content

UPSC: సివిల్స్‌ టాపర్‌ శుభమ్‌ కుమార్‌

Shubham-JAGRATI-AWASTHI
Shubham-JAGRATI-AWASTHI
  •     2, 3 ర్యాంకర్లు 
  •     జాగృతి అవస్తి, అంకితా జైన్‌ 
  •      ఫలితాలు విడుదల చేసిన     యూపీఎస్సీ 
  •      ఉత్తీర్ణులైన 761 మంది అభ్యర్థులు 

సివిల్‌ సర్వీసెస్‌ –2020 టాపర్‌గా శుభమ్‌ కుమార్‌(24) నిలిచారు. బాంబే ఐఐటీలో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన శుభమ్‌ కుమార్‌ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన జాగృతి అవస్తి(24) రెండో ర్యాంకు సాధించారు. మహిళల విభాగంలో ఆల్‌ ఇండియా టాపర్‌గా జాగృతి నిలిచారని యూపీఎస్సీ తెలిపింది. ఢిల్లీకి చెందిన అంకితా జైన్‌ ఆల్‌ ఇండియా మూడో ర్యాంక్‌ సాధించారు. టాప్‌ –25 ర్యాంకుల్లో 13 మంది పురుషులు, 12 మంది మహిళలు నిలిచారు. సివిల్‌ సరీ్వసెస్‌–2020 పరీక్షల తుది ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం  విడుదల చేసింది.  ఇండియన్‌ అడ్మిని్రస్టేటివ్‌ సర్వీస్, ఇండియన్‌ ఫారిన్‌ సరీ్వస్, ఇండియన్‌ పోలీస్‌ సరీ్వస్, సెంట్రల్‌ సరీ్వసెస్‌(గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి) ఉద్యోగాల్లో నియామకాలకు గాను పురుషులు 545 మంది, మహిళలు 216 మంది కలిపి మొత్తం 761 మందిని ఎంపిక చేసింది.  

ఐఐటీ బాంబే విద్యార్థి శుభమ్‌ 
బిహార్‌లోని కటిహార్‌కు చెందిన శుభమ్‌ కుమార్‌ బాంబే ఐఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. మొదటిసారిగా 2018లో యూపీఎస్సీ పరీక్ష రాశాడు. 2019లో 290వ ర్యాంకు సాధించి ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈయన పుణేలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఏడీఎఫ్‌ఎం)లో శిక్షణ పొందుతున్నారు. బిహార్‌లోని విద్యా విహార్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 10వ తరగతి, బొకారోలోని చిన్మయ విద్యాలయలో 12వ తరగతిలో 96% మార్కులతో ఉత్తీర్ణత చెందారు. పరిశోధన కోసం అమెరికా వెళ్లినప్పుడు సివిల్‌ సరీ్వసెస్‌లో చేరాలని తనకు ఆలోచన కలిగిందని శుభమ్‌ తెలిపారు. ఈయన ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ.  శుభమ్‌ తండ్రి బ్యాంక్‌ మేనేజర్‌ కాగా, సోదరి బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌. 

గ్రామాల అభివృద్ధికి పనిచేస్తా 
మహిళా శిశు అభివృద్ధితోపాటు గ్రామాల ప్రగతి కోసం పాటుపడేందుకే ఐఏఎస్‌కు ఎంపికైనట్లు రెండో ర్యాంకర్‌ జాగృతి అవస్తి తెలిపారు. మహర్షి విద్యామందిర్‌తో పాఠశాల విద్య, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(భోపాల్‌)లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యేందుకు భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(¿ోపాల్‌)లో ఉద్యోగం వదులుకున్నారు. ఈమె ఆప్షనల్‌ సోషియాలజీ. అవస్తి తండ్రి ప్రొఫెసర్‌ కాగా, తల్లి గృహిణి. వైద్యునిగా పనిచేసే సోదరుడే తనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. కాగా, మూడో ర్యాంకర్‌ అయిన ఢిల్లీ వాసి అంకితా జైన్‌ ముంబైలోని ఆడిట్‌ అండ్‌ అకౌంట్‌ సరీ్వసెస్‌లో పనిచేస్తున్నారు. అంకితకు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఐపీఎస్‌ (మహారాష్ట్ర కేడర్‌) అభినవ్‌ త్యాగితో రెండు నెలల క్రితమే వివాహమైంది.    

Published date : 25 Sep 2021 06:18PM

Photo Stories