Skip to main content

Civils Rankers: సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు.. ర్యాంకర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: సివిల్స్‌–2022 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు.
Civils Rankers
సివిల్స్‌ విజేతలతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడెమీ డైరెక్టర్‌ బాలలత. తమ సంస్థ నుంచి 18 వరకు ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మొత్తం 933 మంది అభ్యర్థులను అఖిల భారత సర్వీసులకు ఎంపిక చేయగా వారిలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతోపాటు 50 వరకు ర్యాంకులను తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కైవసం చేసుకున్నట్లు ఫలితాల ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ర్యాంకర్లలో పేదింటి కుటుంబాలకు చెందిన వారితోపాటు సాధారణ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు సైతం ఉన్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమాహారతి ఆలిండియా 3వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఆమె ఐదో ప్రయత్నంలో ఈ ర్యాంక్‌ సాధించారు. అలాగే జీవీఎస్‌ పవన్‌ దత్తా 22వ ర్యాంకు, మంచిర్యాల జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్‌ 35వ ర్యాంకు, హనుమకొండకు చెందిన శ్రీసాయి అశ్రిత్‌ శాఖమూరికి 40వ ర్యాంకు, హెచ్‌ఎస్‌ భావనకు 55వ ర్యాంకు, సాయి ప్రణవ్‌కు 60వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణకు 94 ర్యాంకులు సాధించారు.

చదవండి: Civils Results 2022: పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 667 ర్యాంకు

వారితోపాటు నిధిపాయ్‌ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్‌కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బొల్లం మహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, సాయికష్ణ 293 ర్యాంకులు పొందారు. అలాగే 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 వంటి ర్యాంకులను తెలుగు అభ్యర్థులు సాధించారు. మొత్తంగా ఐఏఎస్‌కు 180 మంది ఎంపికవగా ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 మంది ఎంపికయ్యారు. ఇతర కేంద్ర సర్వీసుల్లోని గ్రూప్‌–ఏ కేటగిరీకి 473 మంది, గ్రూప్‌–బీ కింద 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. కాగా, సివిల్స్‌ ఫలితాల విజేతలకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. 

చదవండి: Civils: మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి సివిల్స్‌లో ర్యాంకు.. సివిల్స్‌ గురూ.. మహేశ్‌ భగవత్‌

అమ్మను ఆదర్శంగా తీసుకున్నా...
ప్రభుత్వ ఉపాధ్యాయు­రా­లైన అమ్మ (లలిత­కుమారి)­ను ఆదర్శంగా తీసుకొని చదివా. నాన్న (వెంకటేశ్వర్లు) ఎల్‌ఐసీలో ఉద్యో­గి. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించడం గర్వంగా ఉంది. సమాజానికి సేవ చేయవచ్చునన్న సంకల్పంతో సివిల్స్‌ సాధనకు నిరంతరం కృషి చేశా. 
– జీబీఎస్‌ పవన్‌ దత్తా, 22వ ర్యాంకు

పేదల జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యం..
మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేట గిరిజన గ్రామం. నాన్న ప్రేమ్‌సింగ్‌నాయక్‌ ఉద్యానవన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా, అమ్మ సవిత ప్రైవేటు ఉద్యోగి. ఐఐటీ ఢిల్లీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివా. అక్కడే మాస్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌(ఎమ్మార్‌)లో గోల్డ్‌ మెడల్‌ సాధించా. ఏడాదిపాటు జపాన్‌లో రీసెర్చ్‌ ఇంజినీర్‌గా పనిచేసి ఆ తర్వాత సివిల్స్‌కు సిద్ధమయ్యా. 2021లో తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. చిన్నప్పటి నుంచి పేదలు, గిరిజనుల కష్టాలు చూశా. వారి జీవితాల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతోపాటు పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకొని విజయం సాధించా.    

– సంకేత్‌కుమార్, 35వ ర్యాంకు 

ప్రజాసేవే లక్ష్యం...
మాది హనుమకొండ అడ్వొకేట్స్‌ కాలనీ. పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. నా తల్లిదండ్రులు అమర్, పద్మజ. నాన్న చిట్‌ఫండ్‌ యజమానిగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ‘క్రెడాయ్‌’లో కీలకంగా ఉన్నారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్సెస్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. అంథ్రోపాలజీ ఆప్షనల్‌ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించా. ప్రణాళికాబద్ధంగా చదివితే సివిల్స్‌ ర్యాంకు సులభమే.    – శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్‌, 40వ ర్యాంకు

గతంలోనే సివిల్స్‌కు ఎంపికైనా...
మా స్వస్థలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి. 2017 సివిల్స్‌లో 728వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌లోని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల ప్రాంతీయ డైరెక్టర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ఆరోసారి ప్రయత్నించి విజయం సాధించా. నాన్న ఆవుల లక్ష్మయ్య పూసాల ఎస్‌జీటీ, అమ్మ సునీత గృహిణి. వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ చేశా. ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో సివిల్స్‌పై దృష్టి సారించారు.    

– ఆవుల సాయికృష్ణ, 94వ ర్యాంకు

మళ్లీ రాస్తా.. ఫారిన్‌ సర్వీస్‌ లక్ష్యం..
మాది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామం. తల్లిదండ్రులైన ఏనుగు అంజిరెడ్డి, పుష్పలత ప్రోత్సాహంతో సివిల్స్‌పై దృష్టి పెట్టా. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ యూనివర్సిటీలో బీఏ (ఎకనామిక్స్‌) చదువుతూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మెయిన్స్‌ ఆప్షనల్‌గా పొలిటికల్‌ సైన్స్‌ ఎంపిక చేసుకున్నా. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా 2021లో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించకున్నా పక్కా ప్రణాళికతో చదివి ఈసారి ర్యాంకు సాధించా.  మరోసారి సివిల్స్‌ రాస్తా. ఫారిన్‌ సర్వీసెస్‌ సాధించాలన్న కోరిక ఉంది.
– శివమారుతిరెడ్డి, 132 ర్యాంకు
పట్టుదలతో చదివా...
మాది బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌. ఢిల్లీలోని జేఎన్‌యూలో 2017లో జూనియర్‌ ఫెలోషిప్‌ రావడంతో 2018లో ఢిల్లీ యూనివర్సీటీలో  పీహెచ్‌డీ (సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ స్టడీస్, చైనీస్‌) పూర్తి చేశా. విజయనగరం జిల్లాలోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సివిల్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు అధ్యాపకుడిగా పాఠాలు బోధిస్తున్నా. సివిల్స్‌ కోసం ఐదేళ్లుగా ప్రిపేర్‌ అవుతున్నా. 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వచ్చా. తర్వాత పట్టుదలతో కోచింగ్‌ తీసుకోకుండా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించా. అమ్మానాన్నలు యాదమ్మ, రాములు, భార్య సౌమ్య, స్నేహితుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధ్యమైంది.
– కంటం మహేష్‌ కుమార్, 200వ ర్యాంకు

స్టార్టప్‌ కంపెనీలో కొలువు వదిలేసి..
మాది హనుమకొండ. నాన్న ఉమ్మారెడ్డి వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాక్షేత్రంలో అసోసియేట్‌ డైరెక్టర్‌ (రీసెర్చ్‌)గా పనిచేస్తున్నారు. అమ్మ లక్ష్మి గృహిణి. అమ్మానాన్నలు రావుల ఉమ్మారెడ్డి, లక్ష్మీ. హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసి రెండున్నర నెలలపాటు స్టార్టప్‌ కంపెనీలో పనిచేశా. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి 2020 నుంచి సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతూ మూడో ప్రయత్నంలో సాధించా.   
– రావుల జయసింహారెడ్డి, 217వ ర్యాంకు
నాన్న జీతం రూ. 15 వేలే...
మాది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణం. నాన్న శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఓ హోటల్‌లో నెలకు రూ. 15 వేలకు పనిచేస్తున్నారు. అమ్మ నాగలక్ష్మి గృహిణి. కాలికట్‌లో బీటెక్‌ పూర్తి చేసి ఎల్‌అండ్‌టీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మూడు ప్రయత్నాల్లో విఫలం కావడంతో ఉద్యోగం మానేసి కొత్తగూడెంలోనే ఉంటూ సిద్ధమయ్యా. నాలుగో ప్రయత్నంలో విజయం సా«ధించా. పట్టుదల, అంకితభావం ఉంటే ప్రత్యేక కోచింగ్‌ లేకపోయినా సివిల్స్‌లో విజయం సాధించొచ్చు. 
– గ్రంధే సాయికృష్ణ, 293వ ర్యాంకు

ఐపీఎస్‌కే ప్రాధాన్యం...
మాది హనుమకొండ రాంనగర్‌. నాన్న కొట్టె రాధాకృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో లైబ్రేరియన్‌. అమ్మ మంజుల ఫ్యామిలీ కౌన్సిలర్‌. నేను బీటెక్‌ చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. ఢిల్లీ నోయిడాలోని శివనాడార్‌ యూనివర్సిటీలో బీటెక్‌ ఈసీఈ పూర్తి చేశా. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగం వచ్చినా సివిల్స్‌పై ఆసక్తితో సిద్ధమయ్యా. ఐదోసారి విజయం సాధించా. ఐపీఎస్‌ నా ప్రథమ ప్రాధాన్యత. ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 
– కొట్టె రిత్విక్‌ సాయి, 558 ర్యాంకు 

ఐఆర్‌ఎస్‌గా కొలువు వచ్చినా...
మాది ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న రిటైర్డ్‌ డీఎస్పీ ఇనుకొండ వెంకటేశ్వర్లు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ చదువుతూనే 2019లో తొలిసారి కోచింగ్‌ లేకుండా సివిల్స్‌కు సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లా. రెండోసారి ఇంట్లోనే సిద్ధమై 615వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. ప్రస్తుతం నాగపూర్‌లోని నేషనల్‌ అకాడమీ డైరెక్ట్‌ ట్యాక్స్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఏఎస్‌ లక్ష్యంతో మళ్లీ పరీక్షలు రాసి ర్యాంకు సాధించా.
– మనోజ్, 559వ ర్యాంకు

తెలుగు రాష్ట్రాల ర్యాంకర్లు వీరే 

ర్యాంకు

 పేరు

3

ఎన్‌. ఉమా హారతి

22

జీవీఎస్‌ పవన్‌ దత్తా

33

తరుణ్‌ పట్నాయక్‌ మాదల

35

 అజ్మీరా సంకేత్‌

40

సాయి ఆశ్రిత్‌ శాఖమూరి

54

రిచా కులకర్ణి

55

హెచ్‌ఎస్‌ భావన

60

సాయి ప్రణవ్‌

69

అంబికా జైన్‌

78

ఉత్కర్‌‡్షకుమార్‌

87

అయాన్‌ జైన్‌

94

ఆవుల సాయికృష్ణ

110

నిధి పాయ్‌

132

అనుగు శివమారుతిరెడ్డి

157

రాళ్లపల్లి వసంత కుమార్‌

189

షేక్‌ హబీబుల్లా

200

కమతం మహేశ్‌ కుమార్‌

217

రావుల జయసింహారెడ్డి

243

కె. పవన సాయి సాహిత్య

257

అంకుర్‌ కుమార్‌

270

బి. ఉమామహేశ్వరరెడ్డి

285

చల్లా కల్యాణి

292

పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి

293

గ్రంధి సాయికృష్ణ

297

షివిన్‌ చౌదరి

311

వీరగంధం లక్ష్మీ సునీత

313

కె.ఎన్‌.చందన్‌ జాహ్నవి

346

ఎన్‌.చేతన్‌రెడ్డి

384

తెప్పలపల్లి సుశ్మిత

409

ఇషాన్‌ అగర్వాల్‌

410

డొంగ్రె రేవయ్య

414

చంద్రశేఖర్‌ శంకల

426

సీహెచ్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి

459

చాణక్య ఉదయగిరి

464

సి.సమీరారాజా

469

బొడ్డు హేమంత్‌

480

గోపీకృష్ణ. బి

510

భువన ప్రణీత్‌ పప్పుల

548

దామెర్ల హిమవంశీ

558

రుత్విక్‌ సాయి కొట్టే

559

డి.మనోజ్‌

583

యర్రంశెట్టి ఉషారమణి

630

ఎస్‌.దీప్తి చౌహాన్‌

640

తుమ్మల సాయికృష్ణారెడ్డి

742

రామ్‌దేని సాయినాధ్‌

759

జి.అక్షయ్‌ దీపక్‌

805

మన్నం సుజిత్‌ సంపత్‌

817

సాహిల్‌ మీనా

846

బెండుకూరి మౌర్యతేజ్‌

866

నాగుల కృపాకర్‌ 

Published date : 24 May 2023 01:42PM

Photo Stories