CRPF Constable Jobs 2023 : పదో తరగతి అర్హతలోనే.. 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే పరీక్ష ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు రుసుం జనరల్ (పురుష) అభ్యర్థులకైతే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రకటనను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కి 428 పోస్టులు ఉండగా.. తెలంగాణకి మాత్రం 307 పోస్టులు మాత్రమే ఉన్నాయి. జూన్ 20వ తేదీ నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. జూలై 1వ తేదీ నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హతలు ఉండాలి.
➤☛ SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 5369 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
ఎంపిక విధానం ఇలా..
కంప్యూటర్ బేస్డ్‌టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే.. జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
➤☛ BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 1284 ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
వయోపరిమితి ఇలా.. :
కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు వయో పరిమితి విధించారు. కానిస్టేబుల్ (ఎంఎంబీ/కోబ్లర్, కార్పెంటర్/టైరల్, బ్రాస్ బాండ్/పైప్ బాండ్/ గార్డెనర్/పెయింటర్/కుక్/వాటర్ కారియర్/వాషర్‌మ్యాన్/బార్బర్/సఫాయి కర్మచారి/మాసన్/పంబ్లర్/ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
పరీక్ష విధానం ఇలా.. :
100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2గంటల పాటు ఈ పరీక్ష ఉంటుుంది. జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీమ్యాథమెటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్/హిందీకి 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.
➤☛ UPSC Recruitment 2023: యూపీఎస్సీ–ఈపీఎఫ్‌వోలో 557 పోస్టులు
ఏపీ పరీక్ష కేంద్రాలివే..
అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గగుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
➤☛ Indian Air Force Notification 2023: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
తెలంగాణ పరీక్ష కేంద్రాలివే..
తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్,ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, వరంగల్ (అర్బన్)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://www.crpf.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
9,212 కానిస్టేబుల్ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..