Jobs in Indian Air Force: అగ్నివీర్–వాయు నియామకాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
అగ్నివీర్ నియామకాల కోసం ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలో ‘https://agnipathvayu.cdac.in’ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను పంపించాలని సూచించారు. ఈ రిక్రూట్‌మెంట్ ఎంపిక పరీక్ష మార్చి 17 నుంచి జరుగుతుందని తెలిపారు.
చదవండి: Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్ధులంతా అవివాహితులై ఉండాలని స్పష్టం చేశారు. సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థులు ఇంటర్‌మీడియట్‌లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు సబ్జెక్టులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిప్లమో కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.550తో పాటు జీఎస్‌టీ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర అర్హతలు, నియామకాలకు అవసరమైన వైద్య ప్రమాణాలు, ఇతర షరతులు, నిబంధనల పూర్తి సమాచారం కోసం పైన తెలిపిన వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంలో క్లరికల్, టెక్నికల్ క్యాడర్‌లో యువత ఇకపై నాలుగేళ్లు మాత్రమే సేవలు అందించాల్సి ఉంటుందని, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో 25 శాతం మందిని మాత్రమే తదుపరి శాశ్వత స్థాయి నియామకాలను ఎంపిక చేస్తారని తెలిపారు. దీనివల్ల యువత సైన్యంలో జీవితకాలం పాటు కొనసాగాల్సిన పనిలేకుండానే భారతీయ సైనిక దళాల్లో పనిచేయాలన్న తమ కోరిక నెరవేర్చుకోవచ్చన్నారు.