Skip to main content

Supreme Court Jobs Notifications 2025 : నెలకు రూ.80,000 జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 90 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Supreme Court 90 Jobs Notifications 2025   Supreme Court of India recruitment for Law Clerk-cum-Research Associate  Law Clerk-cum-Research Associate job openings at Supreme Court of India

ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. జ‌న‌వ‌రి 14వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీలోగా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి 20-32 ఏళ్లు ఉండాలి. అలాగే ఉద్యోగాల‌కు ప‌రీక్ష మార్చి 9వ తేదీన ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు నెల‌కు రూ.80,000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ విధానం :  
ఈ ఉద్యోగాల‌కు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

పూర్తి వివ‌రాల‌కు కింది PDFలో చ‌ద‌వండి...

Published date : 13 Jan 2025 09:44AM
PDF

Photo Stories