Success Story: ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. ఈయన పుణ్యమే..
![డా.కె.షర్మిలారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్, సీఆర్‌పీఎఫ్](/sites/default/files/images/2022/06/20/docter-police-1655729534.jpg)
కానీ ఆ తండ్రి అలా కాదు.. పుట్టింది ఆడపిల్ల అయినప్పటికీ మగపిల్లాడి కంటే మిన్నగా చిన్న నాటి నుంచి చదువుతో పాటు నచ్చిన రంగాల్లో వెన్నంటి ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆ కూతురు ఉన్నత శిఖరాలకు చేరి ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత భద్రత సంస్థ అయిన సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్‌గా వైద్య సేవలందించే స్థాయికి ఎదిగింది. అవసరమైనప్పుడు దేశ రక్షణకు తుపాకీ చేత పట్టి పహారా కాస్తోంది. ఆమే మీర్‌పేట నందీహిల్స్‌కు చెందిన నారాయణరెడ్డి చిన్న కుమార్తె డా.కె.షర్మిళారెడ్డి. ఈమె సక్సెస్ స్టోరీ మీకోసం..
అత్యవసర పరిస్థితుల్లో..
![తండ్రి నారాయణరెడ్డితో డా.కె.షర్మిళారెడ్డి](/sites/default/files/inline-images/fater123.jpg)
గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 2020 జూలై 18న విధుల్లో చేరాను. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా భద్రతా బలగాలకు ఎలాంటి శిక్షణ ఇస్తారో అన్ని రకాల శిక్షణలు ఇచ్చారు. వైద్య సేవలు అందిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో జవాన్లతో కలిసి విధులు నిర్వర్తిస్తాం. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్‌గా కాంపోజిట్ హాస్పిటల్ చాంద్రాయణగుట్టలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే. ఆయన నా ప్రతి అడుగులోనూ తోడుండి వెన్నుతట్టి ప్రోత్సహించారు. మహిళలు భద్రతా బలగాల్లో ఎలా పనిచేస్తారు అని ఏనాడూ వద్దని చెప్పలేదు. నాన్న, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైంది.
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి