Skip to main content

సివిల్స్ సాధించేందుకు మాక్‌టెస్ట్‌ల సాధన ఎంతో కీల‌కం..!

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ చివరి దశలో ఎక్కువగా మాక్‌టెస్టులు, ప్రీవియస్‌ పేపర్ల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
దీనిద్వారా స్వీయ సామర్థ్యం, ప్రశ్నల తీరు, పరీక్ష హాల్‌లో సమయపాలనపై అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రం ప్యాట్రన్‌పై కూడా పట్టు పెరుగుతుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులను రాయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వేగం, కచ్చితత్వంపై సరైన సమతుల్యాన్ని పాటించాలి.

సానుకూల దృక్పథం..
సివిల్స్‌ రాసే అభ్యర్థులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు భావించాలి. ప్రస్తుత సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. రోజూ 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం, యోగా చేయడం ద్వారా మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. తగినంత నిద్ర కూడా చాలా అవసరం. అప్పుడే పరీక్ష హాల్లో మెదడు చురుగ్గా పని చేస్తుంది.

ఇంకా చ‌ద‌వండి: part 5: సివిల్స్ మోడ‌ల్ పేప‌ర్లను ప్రాక్టీస్ చేయ‌డం ఎంతో ముఖ్యం.. !
Published date : 03 Oct 2020 11:23AM

Photo Stories