Visionary Vistan: నలంద కళాశాలలో విజనరీ విస్టాన్ వేడుకలు..
లబ్బీపేట: విజువల్ కమ్యూనికేషన్‌తో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అతిథులు చెప్పారు. నలంద డిగ్రీ కళాశాల విజువల్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన విజనరీ విస్టాన్ 2024 మంగళవారం ముగింది. ఈ సందర్భంగా క్లే మోడలింగ్, షార్ట్‌ఫిల్మ్, డ్యాన్స్, డ్రామా వంటి పలు అంశాల్లో జరిగిన పోటీల్లో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Summative Assessment Exams: ఎస్‌ఏ–2 పరీక్షలు తేదీలు విడుదల
కార్యక్రమంలో కంటెంట్ రైటర్ అశ్వతి బాలకృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినూత్నంగా ఆలోచించడం, ఫొటోగ్రఫీ, వెబ్ డిజైనింగ్, మల్టీ మీడియాలలో శిక్షణ పొందితే ఆసక్తి ఉన్న రంగాల్లో కేరీర్‌ను మలచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, విజువల్ కమ్యునికేషన్ విభాగాధిపతి బి.శ్రీనివాసరావు, ఫిరోజ్‌ఖాన్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
Tags
- visual communication
- nalanda degree college
- employment offers
- jobs for visual communication
- Visionary Vistan 2024
- Content writer Ashwati Balakrishnan
- Competitions
- Digital Training
- students education
- Education News
- Sakshi Education News
- NTR News
- EmploymentOpportunities
- ChiefGuests
- DegreeCollege
- Careers
- JobProspects
- DegreeCollege
- Labbipet
- sakshi education