Skip to main content

కరెంట్‌ అఫైర్స్‌ సబ్జెక్ట్‌లో దృష్టి సారించాల్సిన అంశాల గురించి తెలుసుకోండిలా..

గత 10–12 నెలల వ్యవధిలోని జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల గురించి అధ్యయనం చేయాలి. న్యూస్‌ పేపర్లలో ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే చదివి.. నోట్‌ చేసుకోవాలి.

పరీక్షలో కీలక విభాగాలైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌ పరంగా వార్తా పత్రికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్‌లో స్టాటిక్‌ పార్ట్‌ కంటే.. ఫ్యాక్చువల్‌ డేటాపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ముఖ్య టాపిక్స్‌..
సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2021 కరెంట్‌ అఫైర్స్‌ పరంగా ఇండియన్‌ ఎకానమీ, నూతన వ్యవసాయ చట్టాలు, నూతన జాతీయ విద్యావిధానం, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్, వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ స్టేజెస్, 5జీ టెక్నాలజీ–బీమ్‌ ఫార్మేషన్, ఐసీఎంఆర్‌ పనితీరు, డ్రగ్‌ టెస్టింగ్‌ రెగ్యులేషన్‌ ఇన్‌ ఇండియా, స్ట్రింగ్‌ ఆఫ్‌ పెర్ల్స్‌–ఇండియాస్‌ కౌంటర్, కరోనా వైరస్‌ విపత్తు, కరోనా వైరస్‌ టెస్ట్‌ టెక్నిక్స్, జమ్ము అండ్‌ కశ్మీర్‌– లేహ్‌ అండ్‌ లడఖ్‌ ఫార్మేషన్, సర్‌ క్రీక్‌ డిస్ప్యూట్, సిటిజన్‌ అమెండమెంట్‌ యాక్ట్, ఉత్తరాఖండ్‌ సమ్మర్‌ క్యాపిటల్‌ తదితరాలను ముఖ్యమైనవిగా భావించాలి.
 
Published date : 27 Feb 2021 02:52PM

Photo Stories