SSC-CHSL Exam: విజయం సాధించాలంటే...
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షలో విజయం సాధించేందుకు విభాగాల వారీగా పలు సిలబస్ అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
టైర్–1 పేపర్ కోసం
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
Also read: SSC-CHSL 2021: ఇంటర్‌తోనే.. కేంద్ర కొలువు... సరైన ప్రణాళికతో విజయం సాధించే అవకాశం!!
జనరల్ ఇంటెలిజెన్స్
వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. సిరీస్(నంబర్/ఆల్ఫాన్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్(వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్–డీకోడింగ్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
Also read: Admissions in FRI: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, శాతాలను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా, త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
Also read: CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌లో 1149 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీ విషయంలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టిపెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి. సీహెచ్‌ఎస్‌ఎల్ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌ను కూడా కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్ జీకే విషయంలో చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు, వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారాన్ని అవుపోసన పట్టాలి.
డిస్క్రిప్టివ్ పేపర్ కోసం.. ఇలా
టైర్–2లో ఉండే డిస్క్రిప్టివ్ పేపర్ కోసం అభ్యర్థులు ఎస్సే రైటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఆయా సమకాలీన అంశాలకు సంబంధించి దిన పత్రికల్లో వచ్చే వ్యాసాలు, ఎడిటోరియల్స్‌ను చదివి.. వాటి సారాంశాన్ని సొంతంగా రాసేలా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా లెటర్ రైటింగ్‌కు సంబంధించి పర్సనల్, బిజినెస్, అఫిషియల్ లెటర్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రెసిస్ రైటింగ్‌కు సంబంధించి ఒక ప్యాసేజ్‌ను పూర్తిగా చదివి.. అందులోని ముఖ్యాంశాలను గుర్తించి.. వాటి ఆధారంగా కుదించి రాసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ పేపర్‌కు సంబంధించి ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ముందుకు కదలాలి. అప్పుడే నైపుణ్యాలకు మరింత నగిషీలు దిద్దుకునే అవకాశం లభిస్తుంది.
Also read: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..
ఎస్‌ఎస్‌సీ–సీహెచ్‌ఎస్‌ఎల్–2021 ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 7, 2022
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 8, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణకు అవకాశం: మార్చి 11 నుంచి మార్చి 15 వరకు
టైర్–1 పరీక్ష: మే, 2022లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
Also read: Career Guidance: సరికొత్త కెరీర్ మార్గంగా డిజిటల్ జర్నలిజం.. ప్రారంభంలో రూ.20 వేల వేతనం..
పూర్తిగా ప్రిపరేషన్‌కే
సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్1 పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకుంటే.. పరీక్షకు మూడు నెలల సమయం అందుబాటులో ఉందని భావించొచ్చు. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తుకు ప్రక్రియ పూర్తి చేసి.. ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. రోజుకు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మోడల్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ పేపర్లను సాధించాలి.
–ఎ.వినయ్ కుమార్ రెడ్డి, పోటీ పరీక్షల నిపుణులు.