Skip to main content

ఎస్‌ఎస్‌సీ ప్రిపరేషన్‌ టిప్స్‌ గురించి తెలుసుకోండిలా..

మార్చిలో ఎస్‌ఎస్‌సీ సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌)లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ), కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో..అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్‌ కొనసాగించండిలా..

  • అభ్యర్థులు ముందుగా ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి.. ప్రశ్నల శైలిపై పట్టుసాధించాలి.
  • వీలైనన్ని మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. ఆయా పరీక్షల్లో ప్రదర్శనను విశ్లేషించుకోవాలి.
  • విభాగాల వారీ కటాఫ్‌లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు పొందినప్పుడే రెండో దశకు అర్హత లభిస్తుంది.
  • పేపర్‌–2 పూర్తిగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌పైనే ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • పరీక్షకు వ్యవధి తక్కువగా ఉంది. కాబట్టి ముందు పేపర్‌–1లో అర్హత పొందడంపై దృష్టిసారించాలి. అనంతరం పీఈటీ, పేపర్‌–2లకు సంబంధించిన సన్నద్ధతను ప్రారంభించాలి.
  • మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ద్వారా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు పొందేందుకు ప్రయత్నించాలి.
  • గత ఆరునెలల వ్యవధిలో చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. క్రీడలు, అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

రిఫరెన్స్‌ పుస్తకాలు..

  • ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌ మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌.
  • ఎంకే పాండే అనలిటికల్‌ రీజనింగ్‌
  • లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ బుక్‌
  • మనోరమా ఇయర్‌ బుక్‌
  • అరిహంత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ ఆబ్జెక్టివ్‌ అర్థమెటిక్‌
  • ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌–క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (కాంపిటీటివ్‌), ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌.
  • నార్మన్‌ లూయిస్‌ వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

ఇంకా చ‌ద‌వండి: part 1: కేంద్ర బలగాల్లో కొలువులు ఎన్నో.. ఎంపికైతే రూ.లక్షకు పైగా వేతనం..

Published date : 01 Mar 2021 02:13PM

Photo Stories